మోడీ, జగన్ ఇద్దరికీ మండలి రద్దు ప్రమాదమే...! ఎలా అంటే...

Arun Showri Endluri
ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కేంద్రబిందువుగా నిలుస్తోంది శాసన మండలి రద్దు వ్యవహారం. 3 రాజధానుల విషయంలో తన పంతం నెగ్గించుకోవడానికి అని జగన్ ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తర్వాత దాని తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచనలో పడ్డాడు. ఇకపోతే బిజెపి కూడా జగన్ కు ఈ విషయంలో సహకారం అందించాలి అని భావిస్తూ ఉన్నా కూడా తర్వాత భవితవ్యంపై జాగ్రత్తగా ఆలోచించి ముందుచూపు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి కీలకమైన సమయంలో బేరసారాలు ఒక రేంజ్ లో జరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరెవరు ఏ సమీకరణాలను దృష్టిలో ఉంచుకోవాలో ఒకసారి మనం గమనిస్తే....

ఎంత కాదన్నా ఇప్పుడు ఉన్న దశలో అనేక బిల్లులు పార్లమెంటులో పాస్ కావడం కోసం మోదీకి జగన్ ఎంపీ ల మద్దతు ఎంతైనా అవసరం. శివసేన తో పొత్తు పోయింది ఇక నితీష్ కుమార్ లాంటి వారిని అసలు నమ్మేందుకు లేదు. ఇకపోతే జగన్ కు శాసనమండలిని రద్దు చేయడానికి కేంద్రం సపోర్టు తప్పనిసరి. అయితే ఇక్కడ చిక్కల్లా వస్తున్నది ఆంధ్ర రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి వల్లే. ఒకవేళ శాసన మండలి రద్దు అయితే జగన్ దూకుడు దృష్ట్యా వెంటనే మూడు రాజధాని బిల్లు అమలు అవుతుంది. దీంతో రాష్ట్రంలో జగన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా అతనిని ఎవరూ టచ్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ బిజెపి తన భవిష్యత్తు కోసం జనసేన తో పొత్తు పెట్టుకుంది.

ఇక జగన్ విషయానికి వస్తే బిజెపి తనకు సహకరించేందుకు ఏఏ ఆంక్షలు పెడుతుందా అని ఆయన ఆలోచనలో పడ్డాడు. రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరగకుండా మరియు వారి అండతో జనసేన రెచ్చిపోకుండా జగన్ బిజెపితో చర్చలు చాలా నైపుణ్యంతో చేయాల్సి ఉంది. ఇప్పటికే తన జీవితంలో ఇంత ఒత్తిడి ఎదుర్కోని జగన్ ఒక తప్పటి అడుగు వేసినా.... అది తన రాజకీయ భవిష్యత్తుపై నే ప్రభావం చూపవచ్చు. కాబట్టి శాసన మండలి రద్దు వల్ల ఎవరి డేంజర్ వారికి ఉంది అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: