కరోనా ఎఫెక్ట్.. అక్కడ అందరూ జుట్లు కత్తిరించుకుంటున్నారు.. ఎందుకో తెలుసా..?

praveen

చైనాలో గుర్తించిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికీ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాస్త జలుబు దగ్గు జ్వరం వస్తే చాలు ఎక్కడ కరోనా వైరస్ సోకిందో అని  ప్రపంచవ్యాప్తంగా జనాలు బెంబేలెత్తి పోతున్నారు . ఇక కరోనా వైరస్ ఎటు నుంచి వ్యాప్తి చెంది దాడి చేసి ప్రాణాలు బలి తీసుకుంటుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా  వైరస్ చైనా లో అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. చైనాలో ఎంతోమంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు సైతం కోల్పోయారు. 

 

 

 ఇక ప్రపంచ దేశాలన్నీ తమ దేశ పరిధిలోకి కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కొన్ని దేశాల్లో అయితే తమ దేశం నుంచి చైనాకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాయి. అంతేకాకుండా ఆయా దేశాల్లో  ఎవరైనా కరోనా వైరస్ అనుమానితులు కనిపిస్తే వారికి ప్రత్యేక చికిత్సలు అందిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైద్యులు. అటు కరుణ వైరస్ బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా తమకు ఎక్కడ కరోనా వైరస్ సోకి ప్రాణాలు పోతాయోనని  బెంబేలెత్తిపోతున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే కరోనా  వైరస్ వల్ల చైనాలోని వైద్యులు నర్సులు తమ జుట్టు కత్తిరించు కుంటున్నారు. కరుణ వైరస్ బాధితులకు వైద్యం చేసే నర్సులు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు నర్సులకు ప్రత్యేక సూట్లను ఇచ్చారు. అయితే నర్సుల కోసం వచ్చిన ఈ ప్రత్యేక సూట్లని  ధరించాలి అంటే ఎక్కువ జుట్టు ఉండకూడదు. దీంతో వైద్యులు నర్సులు అందరూ తప్పనిసరిగా తమ జుట్టు కత్తిరించుకొని ఈ సూట్  ధరించి కరోనా  వైరస్ బాధితులకు వైద్యాన్ని అందిస్తున్నారు. జుట్టు కత్తిరించు కున్నాక  మళ్లీ వస్తుందని కానీ కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు పోతే మాత్రం మళ్ళీ రావు అని  ఇక్కడి నర్సులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: