నిర్భయ దోషులకు ఉరిశిక్ష పై స్టే తొలగించండి.. కేంద్ర ప్రభుత్వం పిటిషన్...?

praveen

దేశ రాజధాని ఢిల్లీలో 2012 సంవత్సరంలో 23 ఏళ్ల యువతిపై అత్యాచారం ఘటన దోషులకు శిక్ష అమలుపై జాప్యం జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక నిందితుడు మైనర్ కావడంతో మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. మరో నిందితుడు జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నలుగురు నిందితులకు.. ఢిల్లీ పటియాల కోర్టు  సహా హైకోర్టు కూడా ఉరిశిక్ష విధిస్తూ డెత్ వారంట్ జారీ చేసింది. హైకోర్టు నిందితులకు ఉరి శిక్ష విధించేందుకు రెండుసార్లు డెత్ వారెంట్  జారీచేసింది. అయినప్పటికీ నలుగురు నిందితులకు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉరిశిక్ష వాయిదా పడేలా చేస్తున్నారు. 

 ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులు శిక్షణ వాయిదా వేయాలంటూ పిటిషన్ వేయడం... రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడం లాంటి అన్ని జరిగిన తర్వాత నిందితులు అభ్యర్థనకు ప్రతిచోట తిరస్కరణ ఎదురైంది. ఎట్టకేలకు ఢిల్లీ హైకోర్టు డెత్ వారంట్ జారీ చేసి  ఫిబ్రవరి ఒకటవ తేదీన  నలుగురు నిందితులను ఉరి శిక్ష అమలుకు  తీర్పునిచ్చింది. ఇక నిందితుల్లో  ఒకరైన వినయ్ మరోసారి పిటిషన్ దాఖలు చేయటంతో  నిర్భయ దోషులకు ఉరి ఫిబ్రవరి 1న మరోసారి వాయిదా పడింది. అయితే ఇంకా చట్టపరంగా అవకాశం ఉన్న ఇద్దరు దోషులను పక్కన పెట్టి మిగతా ఇద్దరికీ ఉరిశిక్ష అమలు చేయాలని వాదనలు  వచ్చినప్పటికీ కేసులో ఎంత మంది నిందితులు ఉంటే వారి అందరికీ ఒకేసారి ఉరిశిక్ష వేయాలని రాజ్యాంగబద్ధంగా నిబంధనలు ఉన్నాయి అంటూ పటియాల హౌస్ కోర్టు నిందితులకు ఉరిశిక్షను వాయిదా వేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్నాయి. 

 కాగా దీనిపై కేంద్ర హోం శాఖ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . ఈ క్రమంలోనే నిర్భయ దోషులకు శిక్షించాలి అంటూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఉరిశిక్షను వాయిదా వేస్తూ పోతే ఎప్పటికీ నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు కాదంటూ పిటిషన్లో తెలిపారు. అంతే కాకుండా కింది కోర్టుకు ఎలాంటి అధికారం లేకుండా ఉరిశిక్ష వాయిదా వేసిందని... ఇదంతా ఉద్దేశ పూర్వకంగానే చేస్తున్నట్లుంది పిటిషన్లో పేర్కొంది కేంద్ర హోంశాఖ. నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడకుండా పిటిషన్ వేసి చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు అంటూ కేంద్ర హోం శాఖ తెలిపింది.. నిర్భయ దోషులకు ఉరి పై స్టే విధించడం వల్ల చట్టం దుర్వినియోగం అవుతోందని కేంద్ర హోంశాఖ తెలిపింది. నిందితుల ఉరిపై స్టే తొలగించాలంటూ పిటిషన్లో  కోరింది. కేంద్ర హోంశాఖ వేసిన పిటిషన్ పై కొన్ని గంటల్లో విచారణ జరగనుంది. హైకోర్టు ఏం  తీర్పును ఇవ్వబోతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: