షాకింగ్: జేడీ లక్ష్మీనారాయణ.. 2024లో ఆ పార్టీకి సీఎం అభ్యర్థి..?

Chakravarthi Kalyan
మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన అడుగులు తాజాగా బీజేపీ వైపు పడుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ఆయన మాటలు చూస్తుంటే బీజేపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఇప్పటి వరకూ ఓ మంచి సీఎం క్యాండిడేట్ లేని కొరత బీజేపీ ఏపీకి కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం జేడీ పార్టీలోకి వస్తే.. సీఎం క్యాండిడేట్ గా ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేయవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా విజయవాడ వచ్చిన జేడీ ఇందుకు అనుకూలంగానే మాట్లాడారు.. జనసేనకు తాను చేసిన రాజీనామా ఆమోదం పొందిందని.. ఆ పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇకపై ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని అన్నారు. ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తానని విజయవాడలో అన్నారు. ప్రజా సేవకు అత్యుత్తమ వేదిక రాజకీయమే నన్న లక్ష్మినారాయణ.. ఇకపై కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటానన్నారు.

ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూనే బీజేపీపై ప్రశసంల వర్షం కురిపించారు . కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాగుందని ప్రశంశించారు. రాష్ట్రానికి మరిన్ని నిధులుతీసుకువచ్చేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు. కేంద్రం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏ చట్టాలను రాజకీయ కోణంలో చూడకూడదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ చట్టాల అమలు వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు.

ప్రస్తుతం క్యాష్ పాలిటిక్స్, క్యాస్ట్ పాలిటిక్స్ రాజకీయాల్లో ప్రభావితం చేస్తున్నాయని జేడీ అన్నారు. అవినీతి లేని, విలువలు, నైతికతో కూడిన రాజకీయాలు చేయాలన్నదే తన విధానమన్నారు. యువత తలచుకుంటే రాజకీయాల్లో మార్పు సాధ్యమేనని మార్పు తీసుకు రావడమే లక్ష్యంగా నేటితరం యువత ముందుకు రావాలన్నారు. విద్యార్థులు నిర్ణీత లక్ష్ల్యాలను ఏర్పరచుకుని.. కృషి పట్టుదలతో కలను సాకారం చేసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: