సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన అమరావతి రైతులు...?

frame సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన అమరావతి రైతులు...?

Reddy P Rajasekhar

ఏపీ సీఎం జగన్ డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల గురించి ప్రకటన చేసిన తరువాత ఈ వ్యవహారంలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన తరువాత శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు టీడీపీ ఎమ్మెల్సీలు సెలక్ట్ కమిటీకి పంపడంతో అమలులోకి రాలేదు. కానీ సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. 
 
ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాన్ని, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాన్ని, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వలనే సీఎం జగన్ కు అమరావతి రైతులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వం కార్యాలయాలను తరలిస్తూ తీసుకున్న నిర్ణయం గురించి రైతులు ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేస్తూ పిటిషన్ చేశారు. 
 
ఈరోజు హైకోర్టులో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు గురించి పిటిషన్ దాఖలైంది. ఏపీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా జీవో నెంబర్ 13ను తెరమీదకు తెచ్చిందని ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో గురించి విచారణ జరపాలని కోరారు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీఆర్డీఏను, సీఆర్డీఏ ఛైర్మన్ ను, ప్రభుత్వాన్ని ఇందులో ప్రతివాదులుగా చేర్చటం గమనార్హం. 
 
శనివారం రోజున ప్రభుత్వం ఏపీ విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, సభ్యుల కార్యాలయాలను కూడా తరలిస్తూ జీవో విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ పేరిట ఈ జీవోలు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా కలెక్టర్ ను మరియు ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ ను ఈ కార్యాలయాల కోసం తగిన భవనాలను గుర్తించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు పిటిషన్ దాఖలు కావడంతో ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: