వాహనదారులకు షాకింగ్ న్యూస్... ఆ పని చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్..?
ఈ మధ్య కాలంలో యువత బైక్ రేసింగ్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. క్రేజ్ కోసం వాహనాలను వేగంగా నడుపుతూ కొన్నిసార్లు ప్రమాదాలపాలవుతున్నారు. మెట్రోపాలిటన్ సిటీలలో, కాస్మోపాలిటన్ సిటీలలో బైక్ రేసింగ్స్ జరుగుతున్నాయి. బైక్ రేసింగ్స్ వలన సామాన్యులు చాలా సందర్భాలలో తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. హైదరాబాద్ నగరంలోని పీవీ లిమిటెడ్ ఎక్స్ ప్రెస్ వే, నెక్లెస్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లపై బైక్ రేసింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
ఒకప్పుడు రాత్రి వేళల్లో రోడ్లపై ఎవరూ లేని సమయంలో మాత్రమే బైక్ రేసింగ్స్ ఎక్కువగా జరిగేవి. కానీ కాలక్రమేణా పగటిపూట కూడా బైక్ రేసింగ్స్ జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తూ ఉండటంతో పోలీసులు బైక్ రేసింగ్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. తెలంగాణ రవాణా శాఖ కూడా బైక్ రేసింగ్స్ పై ప్రత్యేక దృష్టి బైక్ రేసింగ్స్ కు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటోంది.
పీవీ ఎక్స్ ప్రెస్ హైవే రోడ్లో రెండు స్పోర్ట్స్ కార్లు అతి వేగంగా వెళ్లటంతో పోలీసులు వేగంగా కార్లు నడుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి ఈ ఘటన రావడంతో మంత్రి కూడా ఈ ఘటన గురించి స్పందించారు. నగరంలో ఎవరైతే బైక్ రేసింగ్స్ కు పాల్పడుతున్నారో వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కౌన్సిలింగ్ తరువాత కూడా అదే పునారవృతం అయితే బైక్ నడిపిన వారి లైసెన్స్ లను రద్దు చేయనున్నారు. రెండోసారి దొరికిన పక్షంలో లైసెన్స్ వాహనాలను కూడా సీజ్ చేయాలని మంత్రి సూచించారు. పోలీసులు కూడా ఎక్కువగా బైక్ రేసింగ్స్ జరిగే ప్రాంతాలను గుర్తించి బైక్ రేసర్స్ ను అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాల వలన హైదరాబాద్ నగరంలో బైక్ రేసింగ్స్ తగ్గే అవకాశం ఉంది.