ఎక్కువగా సెల్ఫోన్ వాడితే ఎన్ని అనర్ధాలో తేలిస్తే షాక్ అవుతారు..?
ప్రస్తుతం సెల్ ఫోన్ వాడకం రోజురోజుకు ఎక్కువవుతున్న విషయం తెలుస్తుంది. స్మార్ట్ఫోన్లలో కొత్త కొత్త ఫీచర్లు వస్తుండడం... అటు ఆన్ లైన్ లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ యాప్స్ దొరుకుతుండటం... అంతేకాకుండా జనాలను సరికొత్త మెసేజింగ్ యాప్స్ ఆకర్షిస్తుండటంతో.. సెల్ఫోన్ వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను. ప్రస్తుతం ఒక రోజు ఆహారం లేకుండా అయినా ఉంటారేమో కానీ ఒక్క నిమిషం స్మార్ట్ఫోన్ దగ్గర లేకుండా మాత్రం అస్సలు ఉండరు. పొద్దున నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంతవరకు స్మార్ట్ ఫోన్ వాడే వారు ఎంతోమంది. ఒక్క క్షణం స్మార్ట్ఫోన్ కనిపించలేదు అనుకోండి ఏదో ఒక సునామీ వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా మంచిది. ప్రస్తుతం ప్రతి మనిషి జీవితంలో సెల్ఫోన్ ఒక భాగమైపోయింది.
ఫోన్ వాడకం ఎంతగా పెరిగి పోయింది అంటే... ఒకప్పుడు వన్ జీబీ డేటాను నెల మొత్తం వాడే వారు కానీ ఇప్పుడు వన్ జీబీ డేటా ఒక గంట కూడా సరిపోవడం లేదు అంటే స్మార్ట్ ఫోన్ల వాడకం ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సరికొత్త ఎంటర్టైన్మెంట్ యాప్స్ వస్తుండటం... ఇక ఆన్లైన్ మెసేజింగ్ యాప్ లు నెటిజన్లను బాగా ఆకర్షిస్తుండటంతో... ఇక ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ కూడా రావడంతో... రోజులో 24 గంటలూ స్మార్ట్ ఫోన్లోనే గడిపేస్తున్నారు.ఏ పనిచేస్తున్న మొబైల్ పక్కనే ఉండాలి... చివరికి బాత్రూంకు వెళ్లినా సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళేవారు చాలామంది. ఇలా స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.
అయితే సెల్ఫోన్లు ఎక్కువగా వాడితే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నప్పటికీ సెల్ఫోన్ల వాడకం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం సెల్ఫోన్ లేని మనిషి లేడు అన్నది అందరికీ తెలిసిన నిజం. ఇక అతిగా సెల్ఫోన్ వాడటం వల్ల... మెడనొప్పి రావడం వెన్నుముక్క డిస్కులు సతమతమవ్వటం ... నరాలు బిగుసుకుపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా... సెల్ఫోన్ పదేపదే వాడడం వల్ల చేతులు తిమ్మిర్లు వస్తుండడం స్పర్శ కోల్పోతు ఉండటం లాంటివి జరుగుతుంటాయి. సెల్ఫోన్ అదేపనిగా వాడుతూ ఉండటం వల్ల ... జీర్ణక్రియ లు మందగించడం కండరాలు పట్టేయడం.. అంతేకాకుండా నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సెల్ ఫోన్ వాడకం కాస్త తగ్గించుకుంటే మంచిది అంటున్నారు .