ప్రతిష్టాత్మక వర్సిటీలో భూ కబ్జానా..?

praveen

హైదరాబాద్ నగరంలో భూకబ్జాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డారని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా పలుమార్లు ఆరోపణలు చేసాయి. ఇక తాజాగా ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లో కూడా భూకబ్జా జరుగుతుంది అని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయ్. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నాలుగు ఎకరాల భూమికి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 200 కోట్ల వరకు విలువ ఉంది.. కాగా  ఇంత విలువైన భూమి... ప్రస్తుతం కబ్జా అవుతుంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో నాలుగు ఎకరాల భూమి కబ్జా అవుతున్నప్పటికీ... ఉస్మానియా యూనివర్సిటీ రెవెన్యూ అధికారులు మాత్రం కళ్లుండి చూడలేని వారిలా సైలెంట్ గా ఉండిపోతున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. 

 

 అయితే అధికార పార్టీకి చెందిన కార్పోరేటర్ భర్త.. ఈ రెండు వందల కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కార్పొరేటర్ భర్త స్థానిక ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి కూడా సన్నిహితుడు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి యూనివర్సిటీ విసి సహ రెవెన్యూ అధికారులు భయపడుతున్నట్లు సమాచారం. అయితే నిజాం పాలన కాలంలో నాటి రాజు ప్రస్తుత భూములను 2  రూపాయలు ఎకరం చొప్పున హిమ్మత్ అలీ ఖాన్ అనే వ్యక్తి నుంచి కొన్నట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే అధికార పార్టీ నేత హిమ్మత్  అలీ ఖాన్ వారసుల నుంచి తాను కొనుకున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 

 


 అయితే నగర నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 2 వందల కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల భూమి కబ్జా అవుతున్నప్పటికీ కూడా... ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీ కి  చెందిన చాలా భూమిని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నప్పటికీ యూనివర్సిటీ  అధికారులు మాత్రం పట్టించుకోలేనట్లు  తెలుస్తోంది. యూనివర్సిటీ భూకబ్జాలపై  విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతు ఉన్నప్పటికీ కూడా అటు అధికారులు కానీ కబ్జాదారులు  కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీతో కుమ్మక్కయి యూనివర్సిటీ లో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అని  విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: