ప్రత్యర్ధులపై చేసే ఆరోపణలు, విమర్శలు లక్ష్మణరేఖను దాటేశాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు కంపరాన్ని కలిగిస్తున్నాయి. రాజధాని గ్రామాల్లో చంద్రబాబునాయుడుతో కలిసి రామకృష్ణ పర్యటించారులేండి. ఆ సందర్భంగా సిపిఐ కార్యదర్శి మాట్లాడుతూ కనిపిస్తే తుళ్ళూరులో ఆడవాళ్ళు జగన్ ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.
ఇక్కడ సమస్య ఏమిటంటే రాజకీయంగా అభిప్రాయాలు వేరుగా ఉండచ్చు, అభిప్రాయబేధాలు కూడా ఉండచ్చు. ఒకళ్ళు చెప్పినదాన్ని మరొకరు అంగీకరించకపోవచ్చు. విధానపరంగా తీవ్రంగా విభేదించటంలో తప్పు కూడా లేదు. ప్రభుత్వమైనా ప్రతిపక్షాలైన మాట్లాడేటపుడు విధానపురమైన విషయాలే మాట్లాడాలి కానీ ఆగర్భశతృవులు మాట్లాడుకున్నట్లు బూతులు మాట్లాడకూడదు. అదే సమయంలో ప్రత్యర్ధులను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు చవకబారుగా ఉండకూడదు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు నంద్యాల ఉపఎన్నికల బహిరంగసభలో చంద్రబాబునాయుడును ఉద్దేశించి బహిరంగంగా ఉరితీసినా తప్పులేదు అని జగన్ అన్న మాటలు కూడా తప్పే. ఇక్కడ వ్యక్తులకన్నా వ్యవస్ధలు, స్ధాయి శాస్వతం. ముఖ్యమంత్రి స్ధానంలో చంద్రబాబు ఉండచ్చు లేదా జగన్ ఉండచ్చు. రేపు మరొకరు కూడా రావచ్చు చెప్పలేం. ఇందులో భాగంగానే చంద్రబాబు కానీ రామకృష్ణ కానీ జగన్ ను ఉద్దేశించి చేస్తున్న, చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సమర్ధనీయం కాదు.
రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేకే ప్రత్యర్ధులు నోటికి పనిచెబుతున్న విషయం అర్ధమైపోతోంది. తాజాగా సిపిఐ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమే. మహిళలు తనను అడ్డంగా నరికేస్తారన్న భయంతోనే జగన్ పోలీసులను పెట్టుకుని తిరుగుతున్నారట. నిజానికి రామకృష్ణ మాటల్లో అర్ధమేలేదు. ముఖ్యమంత్రి స్ధాయిలోనే కాదు ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతి ఒక్కరికీ భద్రతనేది ఉంటుంది. అది లేకుండా తిరగమని సవాలు చేయటమంటే సినిమాలో డైలాగ్ కాదు.
మరొక మంత్రి బొత్సా సత్యనారాయణను పట్టుకుని రామకృష్ణ గాడిద అని అన్నారు. రాజధాని గ్రామాల్లో కాబట్టి ఉద్యమం ప్రశాంతంగా సాగుతోందట. రాయలసీమలో అయితే ఎక్కడికక్కడ పగలగొట్టేవాళ్ళం అని అనంటలో జనాలను రెచ్చగొట్టటం తప్ప మరేమీ కనబడటం లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: