మేడారం జాతరకి పెంచిన బస్సులు..పెరిగిన ఛార్జీలు.. ఎంతో తెలుసుకోండి

Pranateja Sriram

తెలంగాణలోకాదు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరకి సమయం ఆసన్నమైంది. ఈ నెల ఐదవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు జరుగుత్న్న ఈ జాతరకి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయుచున్నారు. సుమారు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

 

 

జంపన్న్నవాగులో స్నానం మొదలుకుని బెల్లం సమర్పించడం వరకూ అన్నీ ముఖ్య ఘట్టాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ఈ జాతరకి మరింత మందిని తీసుకువచ్చే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. మన తెలంగాణ వైభవాన్ని దశదిశలా చాటే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. వన్య ప్రాంతమైన ప్రాంతమైన మేడారంలో జరుగుతున్న ఈ జాతరకి వెళ్ళే భక్తుల కోసం ప్రత్యేక బస్సులని ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టిసీ. 

 

 

ఈ సంవత్సరం సుమారు  23 లక్షల మందిని తరలించేలా లక్ష్యం పెట్టుకున్న ఆర్టీసీ.. ఇప్పుడున్న ఛార్జీలకు 50% అదనంగా ఛార్జీలు వసూలు చేయబోతోంది. పెరిగిన బస్సు ఛార్జీల వివరాలు కింది విధంగా ఉన్నాయి

 

 

మేడారం  బస్సు చార్జీల వివరాలు


రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి రూ.440
ఖాజీపేట నుంచి రూ.190
హన్మకొండ నుంచి రూ.190
వరంగల్ నుంచి రూ.190
పరకాల నుంచి రూ.190
చిట్యాల నుంచి రూ.200
ఘణపురం(ము) నుంచి రూ.140
భూపాలపల్లి నుంచి రూ.180
కాటారం నుంచి రూ.210
కాళేశ్వరం నుంచి రూ.260
సిరోంచ నుంచి రూ.300
ఏటూర్ నాగారం నుంచి రూ.60
కొత్తగూడ నుంచి రూ.240
నర్సంపేట్ నుంచి రూ.190
మహబూబాబాద్ నుంచి రూ.270
తొర్రూర్ నుంచి రూ.280
వర్ధన్నపేట్ నుంచి రూ.230
స్టేషన్ ఘన్పూర్ నుంచి రూ.240
జనగామ నుంచి రూ.280 వసూలు చేస్తారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: