ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వనందుకు ఏమైందో తెలుసా..?

NAGARJUNA NAKKA

ఎవరితోనైనా గిల్లికజ్జాలు పెట్టుకోవాలంటే ముందుండే ట్రంప్‌ మరోసారి గొడవ పెట్టుకున్నాడు. ఈ సారి ఏ కొరియతోనో.. చైనాతోనో కాదు తమ దేశపు స్పీకర్‌తోనే.. అసలు ప్రతినిధుల సభ స్పీకర్‌తో అధ్యక్షుడు గొడవ పెట్టుకోవాడానికి కారణమేంటి..?  

 

అగ్రదేశం వార్షిక ప్రసంగంలో అధ్యక్షుడు, స్పీకర్‌ మధ్య చిన్నపాటి యుద్ధమే చోటు చేసుకుంది. గతంలో అనేక సార్లు బహిరంగంగానే మాటల కత్తులు దూసుకున్న వీరివురు మరోసారి హట్‌ టాపిక్‌ అయ్యారు. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి వార్షిక ప్రసంగం చేశారు. అయితే అంతకుముందు తన ప్రసంగం కాపీని ట్రంప్‌ నాన్సీకి అందజేశారు. 

 

ప్రసంగ కాపీని అందించే సమయంలో నాన్సీ అధ్యక్షుడికి షేక్‌హ్యాండ్‌ అందించగా.. ట్రంప్‌ తన చేతిని ఇవ్వకుండానే వెనక్కి తిరిగారు. ఆ పరిణామంతో అవాక్కయిన స్పీకర్‌ నాన్సీ తీవ్ర అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి ప్రసంగం అయిపోయాక.. అందరూ చప్పట్టు కొడుతూ అభినందించారు. స్పీకర్‌ నాన్సీ మాత్రం ట్రంప్‌ ప్రసంగం కాపీలను చించేశారు. ప్రసంగ పత్రాలను ఎందుకు చించేశారని నాన్సీని విలేకరులు అడగ్గా.. ఆయన చేసిన మర్యాదకు ఇదే కరెక్ట్ ఆన్సారని బదులిచ్చారు.

 

అయితే గతంలోనూ వీరి మధ్య ఇలాంటివి అనేకం చోటు చేసుకున్నాయి. గతేడాది ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించినప్పుడు వెటకారంగా చప్పట్లు కొట్టారు నాన్సీ. ఇటీవల ట్రంప్‌పై అభిశంసన తీర్మానం వచ్చినప్పుడు.. నాన్సీ... దానికి ఆమోదముద్ర వేస్తూ..వేగంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ ఎదురుపడటం ఇదే తొలిసారి. 

 

మొత్తానికి స్పీకర్ నాన్సీ తీవ్ర అసహనానికి గురైంది.  ట్రంప్ పై చిర్రుబుర్రులాడింది. అమెరికా అధ్యక్షుడు ప్రసంగిస్తుండగా.. లెక్కచేయనే లేదు. ఇదంతా ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వనందుకే. చివరకు ఆయన ప్రసంగం ముగియగానే అసహనంగా చప్పట్లు కొట్టింది. తర్వాత ట్రంప్ ప్రసంగ ప్రతులను చించివేసింది. దే ఇపుడు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: