భర్త, కూతురిని అడ్డు పెట్టుకుని... ఆ మహిళను ఏం చేశారంటే...!
పాతబస్తీకి చెందిన 23ఏళ్ళ వివాహిత తన భర్తతో కలిసి కూలిపని చేసుకుంటూ ఉండేది. అదే బస్తీకి చెందిన 28ఏళ్ళ శివ అనే అబ్బాయి సెంట్రింగ్ పని చేసేవాడు. అప్పుడప్పుడు పని కోసం ఆమెను తన వెంట తీసుకువెళ్ళేవాడు. ఓ రోజు అలాగే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పని ఉందని చెప్పి ఆమెను తన బండి మీద తీసుకువెళ్ళాడు. తన స్నేహితుడు బస్వరాజ్ (30) వాళ్ళింటికి తీసుకువెళ్ళి అతడిని బయట ఉండమని చెప్పి శివ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. అంతేకాక ఈ విషయాన్ని ఎవరితోనైనా చెపితే తన భర్తను పిల్లలను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి భయపడి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మరుసటి రోజు బసవరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో కూడా శారీరకంగా కలవాలంటూ ఆమెను ఒత్తిడికి తీసుకువచ్చాడు. లేదంటే శివతో సంబంధం ఉందన్న విషయం తన భర్తతో చెబుతానని భయపెట్టాడు. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్ధంకాక భర్తకు అసలు విషయం చెప్పింది. భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు నిందితులు శివ, బస్వరాజ్ల పై అట్రాసిటీ, అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ఇక ఇదిలా ఉంటే ఎన్ని శిక్షలు ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల పై జరిగే అరాచకాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు.