ఇద్దరు అమ్మాయిలు ఒకే సారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు...ఎందుకు చేసుకున్నారు వీడని మిస్టరీ..
పక్క పక్క ఇళ్ళ లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు ఒకేసారి ఉరి వేసుకొని చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది..ఒకే తాడు తో ఒకే రోజు అమ్మాయిలు ఉరి వేసుకోవడం సంచలనం కలిగించింది..ఒక మిస్టరీ గా ఇక్కడ జరగడం అందరినీ ఆలోచింప చేస్తోంది.. వారి మధ్య స్నేహం ఇలా చివరికి మారుతుంది అని అను కోలేదు అంటూ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.. కదిలించి వేస్తున్న సంఘటన ఇది..
మహబూబ్ నగర్ జిల్లా పోతునపల్లికి చెందిన మమత కుటుంబం కొన్నేళ్ల కిందట నగరాని కి వలస వచ్చింది. హయత్ నగర్ లోని రాఘవేంద్ర కాలనీ లో నివాసముంటోంది. కర్నూల్ జిల్లా మాధవరం మండలం వెలుగోడు గ్రామానికి చెందిన గౌతమి కుటుంబం కూడా బతుకుదెరువు కోసం వచ్చి అదే కాలనీలో ఉంటోంది.అలా ఉన్న వారిద్దరూ మంచి స్నేహితులు గా మారారు..
ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉంటూ కుటుంబా నికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఏమోందో ఏమో తెలియదు.. శుక్రవారం మమత, గౌతమి ఇద్దరూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు. ఒకే ఫ్యాన్‌కి ఉరేసుకుని బలవన్మరణా నికి పాల్పడ్డారు. ఇంట్లో కలహాల వల్ల చనిపోయారా అనే విషయాలు పూర్తిగా తెలియాలి..గ్రామం లో వీరిద్దరి మరణం తో విషాద ఛాయలు అల ముకున్నాయి..
మమత తల్లి దండ్రులు మహబూబ్ నగర్‌లో వివాహాని కి వెళ్ల గా ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. అయితే చనిపోయే ముందు వారు రాసిన సూసైడ్ లెటర్ గుండెల్సి పిండేస్తోంది. అమ్మా నాన్న లకు భారంగా ఉన్నామని.. ఇకపై అలా ఉండ కూడదనే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నా మని రాసి ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.