కరోనా వైరస్ సోకడానికి ఈ జీవి కూడా కారణమంటా...! మరో కొత్త జీవి పేరుని చెబుతున్న చైనా శాస్త్రవేత్తలు...!
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ఏకైక సమస్య కరోనా వైరస్. ఇది ఎంతలా ప్రభావం చూపించిందంటే ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీసేంతల. ముఖ్యంగా చైనాలో ఇప్పడి వరకు అందుతున్న సమాచారం వరకు 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. అలాగే ముపై వేలకి పైగా దీని భారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఆ దేశంలో పరిస్థితి ఎలా మారిందంటే ఎవరైనా రోడ్డు మీద పడిపోతే వారిని కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదంటే అక్కడి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు.
ఆ విష్యం అలా ఉంటే ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తోందన్న దానిపై చైనా శాస్త్రవేత్తలు చెబుతున్న దానిలో ఒకదానికి ఒకటి అసలు పొంతన ఉండడం లేదు. ఎందుకంటే పాములు, గబ్బిలాల వల్లే కరోనా వైరస్ వచ్చి ఉంటుందని తొలుత చెప్పిన శాస్త్రవేత్తలు కానీ, ప్రస్తుతం అలుగు (పాంగొలిన్) కూడా ఇందుకు కారణం కావొచ్చని చెబుతున్నారు. వీటి జన్యుక్రమం కరోనా కొత్త తరహా వైరస్ తో 99 శాతం సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
చైనాతో సహా మరికొన్ని దేశాల్లోనూ అలుగులను చాలా మంది తింటారు. దీనితో వైరస్ వ్యాప్తికి ఇదే కారణం అయి ఉంటుందని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఒక అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా చైనాలో ప్రాణాలు విడిచిన వారి సంఖ్య ఇప్పటికి 636కి చేరగా, 31,161 మందికి సోకినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఒకేఒక్క రోజులో 73 మంది మృతి చెందగా, వారిలో 69 మంది మంది హుబెయ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం. ఇంకోవైపు ఐరోపా దేశాల్లో ఈ వైరస్ కొనాగుతుంది. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 31 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.