షాకింగ్ : కియాపై రాయిటర్స్ తప్పుడు కథనం వెనుక.. టీడీపీ అగ్రనేత చిన్నల్లుడు..?

Chakravarthi Kalyan
అనంతపురంలోని కియా ప్లాంట్ ఏపీ నుంచి తరలిపోనుందనే వార్తను రాయిటర్స్ సంస్థ నాలుగు రోజుల క్రితం ప్రచురించడం కలకలం రేపింది. దీనిపై ఏపీలో పెద్ద దుమారమే రేగింది. అయితే.. కియా విషయంలో దుష్ప్రచారం జరిగిపోయిన తర్వాత... సదరు రాయిటర్స్ సంస్థ తాపీగా స్పందించింది.

ఈ కథనం పొరపాటున రాశామని.. అది అసత్యకథనమని.. అందుకే దాన్ని తొలగిస్తున్నామని ప్రకటించింది. మరి రాయిటర్స్ వంటి సంస్థ అలా అడ్డగోలుగా ఎలా కథనం రాస్తుంది. మళ్లీ అంత సులభంగా ఎలా సారీ చేప్పేసిందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీడీపీ లాబీయింగ్ ఫలితంగానే ఈ కథనం వచ్చిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కథనం వెనుక.. తెలుగుదేశం అగ్రనేత, సినీనటుడి యొక్క చిన్న అల్లుడు ఉన్నాడనే కథనాలు వినిపిస్తున్నాయి.

ఒక సోషల్ మీడియా కథనం ప్రకారం.. గతంలో ఫిబ్రవరి 23 ,2017 న చంద్రబాబు ప్రభుత్వం డిజిటల్ ట్రాన్స్మిషన్ పేరుతో ఈ – ప్రగతిలో భాగంగా ఇన్నోవేషన్ యాప్ కోసం రాయిటర్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు…దానిలో గీతం కాలేజీని ( బాలకృష్ణ వియ్యంకుడు ) కూడా భాగస్వామిని చేసారు…రాయిటర్స్ సంస్థతో ఒప్పందంలో భాగంగా 7 జీవోల ద్వారా కేటాయించిన మొత్తం 270 కోట్లు… ప్రతి జీవోలో చెప్పిన కారణాలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే…

----వ్యక్తిగత ఖర్చులు –29 కోట్లు

— ఆఫీస్ ఖర్చులు –44 కోట్లు

— విక్రేతల చెల్లింపులు ( రాయిటర్స్ ) – 147 కోట్లు

— ల్యాండ్ హబ్ –12 కోట్లు

— డిజిటల్ ట్రాన్స్మిషన్ ( రాయిటర్స్ ) – 6 కోట్ల 6 లక్షలు

— ఇతర ప్రాజెక్టులు - 36 కోట్లు

ఇలా రాయిటర్స్ సంస్థకు కోట్లలో లాభం చేకూరుస్తూ.. తాము కూడా కోట్లలో వెనకేసుకున్నందువల్లే.. ఈ తప్పుడు కథనం రాయించే సాహసం చేశారన్నది సదరు సోషల్ మీడియా కథనం ఉద్దేశం. మరి లోగుట్టు ఏంటో పెరుమాళ్లకే ఎరుక..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: