ప్రియురాలితో రాసలీలు చేసిన భర్త.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య
ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, ఎన్నో కళలతో అమ్మాయి మెట్టింట్లో అడుగు పెడుతుంది. కన్నవారిని కాదనుకొని తాళి కట్టిన భర్తే సర్వస్వం అనుకోని మెట్టినింటికి వస్తుంది. కానీ ఆమె ఆశలకు నీరు గారుస్తూ చివరికి వేధింపులతోనే భర్త వారిపైకి యమపాశం వదులుతున్నాడు. వరకట్నం కోసం కొందరు, మద్యానికి బానిసై కొందరు, అక్రమ సంబంధాలతో మరి కొందరు ఈ వేధింపులకు గురై చనిపోతూనే ఉన్నారు.
భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లిలో చోటు చేసుకుంది. మండలంలోని డి.కొత్తూరుకు చెందిన నాగవెంకట వరలక్ష్మికి (28) నక్కపల్లికి చెందిన కొప్పిశెట్టి చినరాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో చినరాజు ఆమెను పట్టించుకోవడం మానేసి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
భార్య ఎదుటే ప్రియురాలితో సన్నిహితంగా ఉంటూ తీవ్రంగా వేధించాడు. దీనికి తోడు అత్తమామలు కూడా వరలక్ష్మిని సూటిపోటి మాటలతో వేధించేశారు. శనివారం రాత్రి తన ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చి భార్య ఎదుటే గదిలోకి వెళ్లి రాసలీలలు కొనసాగించాడు. దీంతో సహించలేకపోయిన వరలక్ష్మి భర్తతో గొడవ పడింది. ఆవేశంలో మేడపైకి వెళ్లి దూకేసింది. దీంతో ఆమెను చినరాజు తుని ఆస్పత్రికి తీసుకెళ్తూ తిట్టి చేయి చేసుకున్నాడు. దీంతో వరలక్ష్మి మనస్తాపానికి గురైంది. ఇంటి కొచ్చిన తర్వాత ఆమె గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్యకు ముందు కొత్తూరులో ఉండే తన అక్క లావణ్యకు వాట్సాప్ విషయం చెప్పింది. తన మృతికి భర్త, అత్త, ఆడపడుచు, తన భర్త ప్రియురాలే కారణమని ఆరోపించింది. ఆమె అప్రమత్తమై బంధువులను హెచ్చరించేలోగానే వరలక్ష్మి ఉరేసుకుని చనిపోయింది. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు వారందరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.