ఆనందంతో ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన కేజ్రీవాల్.. ప్రజలనుద్దేశించి ఏం మాట్లాడారంటే..?

praveen

దేశ రాజధాని ఢిల్లీలో నేడు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్ ఆప్  పార్టీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.ఏ పార్టీ కూడా దరిచేరని విధంగా అఖండ విజయాన్ని అందుకుంది కేజ్రీవాల్ పార్టీ. ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకోవడానికి బిజెపి పార్టీ ఎన్నో  వ్యూహాలతో ముందుకు వచ్చినప్పటికీ... ఢిల్లీ ప్రజలు మాత్రం మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఇక భారీ మెజారిటీ లో మూడోసారి కేజ్రీవాల్ అధికారాన్ని దక్కించుకోవడం తో ఢిల్లీలో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఢిల్లీలో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలను  ఉద్దేశిస్తూ ప్రసంగించారు అరవింద్ కేజ్రీవాల్.

 

 ఈరోజు అసెంబ్లీ ఫలితాల్లో  కేజ్రీవాల్ సంచలన మెజారిటీతో గెలవడమె  కాదు ఈ రోజు కేజ్రీవాల్ భార్య పుట్టినరోజు కావడంతో... భార్య పుట్టిన రోజు నాడే చిరస్మరణీయ గెలుపు అందుకున్న కేజ్రీవాల్ ఎంతో  ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకున్నారు. ఇక ఫలితాల అనంతరం అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఐ లవ్ యు డిల్లీ అంటూ  ఫ్లయింగ్ కిస్ ఇచ్చారూ. సొంత కొడుకులా ఆదరించి మూడోసారి తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన ఢిల్లీ ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఢిల్లీ ఫలితాలతో దేశంలో కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

 

 

 మూడోసారి తనపై నమ్మకం ఉంచి ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇది తమ  విజయం మాత్రమే కాదని ఇది దేశ విజయం... కొడుకు గా భావించి ఓట్లేసిన ప్రజల విజయం అంటూ కేజ్రీవాల్ ప్రసంగించారు. పని చేసిన వారికే ప్రజలు పట్టం కడతారని మరోసారి ఢిల్లీ ప్రజలు నిరూపించారు అంటూ తెలిపారు. ప్రజలందరికీ తమ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను తమ విజయానికి బాటలు వేసాయి అంటూ కేజ్రీవాల్ తెలిపారు. విద్యుత్ నీటి సరఫరా పౌరసేవలు విద్య వైద్యం కోసం ప్రభుత్వం చేసిన కృషి వల్లే ప్రజలు తమను ఆదరించారు అంటూ ప్రసంగంలో తెలిపారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. మంగళవారంనాడు ఢిల్లీ ప్రజలను హనుమంతుడు ఆశీర్వదించాడు. తమ ప్రభుత్వంపై కూడా ఎప్పుడూ ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. ప్రజలకు సేవ చేసేందుకు తమకు  సన్మార్గాన్ని చూపిస్తాడని మేము నమ్ముతున్నాం అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: