అక్కడ తప్పు చేసిన వారి కుటుంబంలోని స్త్రీలను గాడిదలతో రేప్ చేయించడం జరుగుతుందట.. ??

venugopal

పూర్వకాలంలో కొందరు పాలకులు ఆడవారిని ఎంత నీచంగా చూసేవారో చరిత్ర చెబుతుంది.. ఇంగ్లీషు పాలనలో ఆడవారి కష్టాలు అన్ని ఇన్ని కావు.. కొన్ని కొన్ని రాజ్యాల్లో అయితే నచ్చిన ఆడవారిని ఇష్టారీతిగా అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఇక చాలా మందికి జోగిని వ్యవస్ద, సతీసహగమనం లాంటివి మాత్రమే తెలుసు.. కాని మన చెవులకు వినబడని ఎన్నో అరాచకాలు కాల గర్భంలో కలిసిపోయాయి.. ఇక ఈ మధ్యకాలంలో కొందరు చేస్తున్న పరిశోధనల మూలంగా ఒక నమ్మలేని నిజం బయటకు వచ్చింది..

 

 

ఈ ఘటనకు సాక్షాలు అయితే లేవు కానీ మరాఠీ భాషలో ఉన్న కొన్ని తామ్రపత్రాలు, శాసనాలు, ఇతర పత్రాలన్నీ 11వ శతాబ్దంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో స్పష్టంగా చెబుతున్నాయి... మహారాష్ట్రలో కొన్ని ఆలయాల ప్రాంగణాల్లో కనిపించే శిలా శాసనాలను గమనిస్తే నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఎలా ఉండేవో అర్థమవుతుంది. ఇకపోతే మహారాష్ట్రలో శిలాహర్ అనే రాజ్యం 10వ శతాబ్దంలో ఉండేదట. ఆ రాజ్యంలో రాజు ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించి ‘ఎవరు తప్పు చేసినా, వారి కుటుంబంలోని స్త్రీలను గాడిదలతో రేప్ చేయించడం జరుగుతుంది’ అని చెప్పే శిలా శాసనాలు శిలాహర్ ప్రాంతంలో దొరికాయట. గధేగల్ అని పిలవబడే ఆ శిలా శాసనాలు నాటి సమాజంలో మహిళల పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

 

 

ఇక మహారాష్ట్రలో గతంలో ఈ శిక్ష అమల్లో ఉన్నట్టు చారిత్రక ఆధారాలు లభించాయట.. ఈ శాసనాలపైన పీహెచ్‌డీ చేస్తున్న హర్షదా విర్కుద్ అనే ముంబయికి చెందిన యువతి  తన రీసెర్చ్‌లో భాగంగానే ఈ గధేగల్ శాసనాలనూ ఆమె అధ్యయనం చేశారట.. ఇకపోతే మూడు భాగాలుగా ఉన్న ఈ శాసనాల్లోని పై భాగంలో శాసనం పేరు, మధ్య భాగంలో ఆ శాసన వివరాలు, కింది భాగంలో దాని తాలూకు బొమ్మలు చెక్కి ఉన్నాయట. ఇకపోతే అప్పట్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో వీటిపైన పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక అర్థమైందంటారు హర్షదా. ఇక పురుషులు ఆ శాసనాల్లో ఉన్న శిక్షను అమలు చేస్తే తలదించుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్లు తప్పు చేయడానికి భయపడతారనే ఉద్దేశంతో ఆ శిక్షను ప్రవేశపెట్టుంటారని తెలుపుతున్నారు..

 

 

ఇదే కాకుండా ముంబైకి చెందిన కురుష్ దలాల్ అనే మరో పురావస్తు శాస్త్రవేత్త కూడా వీటిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అదేమంటే ‘ఇలాంటి శిలా శాసనాలపై ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా, వాటిని దేవుళ్లుగా కొందరు  కొలుస్తారు. కొందరు వాటిని చెడుగా భావిస్తారు. ఇవన్నీ వదిలేస్తే ఒక ప్రాంతంలో శిలలు దొరికాయంటే దానర్థం ఆ ప్రాంతానికి ఏదో చారిత్రక ప్రాధాన్యం ఉందని అర్ధం అని అంటున్నారు..

 

 

ఇకపోతే నాటి కాలంలో రాజులు ఎంత కఠినంగా ఉండేవారో చెప్పడానికి ఈ శాసనాలను చెక్కించి, ప్రజలను భయ పెట్టడానికే వీటిని ఏర్పాటు చేయించేవారు అని అంటారాయన.  ఇక ఆ శిలల ఆధారంగా చరిత్రను అధ్యయనం చేయవచ్చూ కానీ, మూఢ నమ్మకాల జోలికి వెళ్లకుండా వాటి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించడం మంచిదనీ హర్షద తన అభిప్రాయాన్ని తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: