బాబోరి అవినీతి చిట్టా... గుట్టంతా రట్టు చేసిన సజ్జల..!
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాబోరి అవినీతి చిట్టా విప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్టాన్ని అప్పుల ఊబిలో ఉంచడమే కాకుండా రాష్ట్రానికి ఎలాంటి ఆస్తులు సృష్టించకుండా మూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్టాన్ని ముంచేసి వెళితే ఈ అప్పుల్లో ఎక్కువ భాగం బినామీల ద్వారా చంద్రబాబుకే చేరిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు అయినందువలన అంతర్జాతీయ నేరస్తులతో కూడా చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని రుజువైందని చంద్రబాబు అక్కడికి ఎన్ని వేల కోట్లు తరలించాడో తెలియదు కానీ చంద్రబాబు అవినీతికి సంబంధించిన అక్రమాలు మాత్రం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.ఈ నేపథ్యంలో వరుసగా వారం రోజులపాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీబీఐ చేసిన దాడులలో పీఎస్, చిన్న సైజు కాంట్రాక్టర్ల దగ్గరే 2000 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని చెప్పారు.
పీఎస్ దగ్గరే 2,000 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయంటే చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు తరలించి ఉండొచ్చని అనడంలో ఆశ్చర్యం ఏమైనా ఉందా...? అని సజ్జల ప్రశ్నించారు. జగన్ ది తెరిచిన పుస్తకం అని చంద్రబాబు తీగ లాగితే దొంకంతా కదులుతోందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ 2000 కోట్ల రూపాయల గురించి ఎందుకు స్పందించటం లేదో చెప్పాలని సజ్జల పవన్ ను ప్రశ్నించారు.
గత వారం రోజుల నుండి ఐటీ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుతున్న సోదాలలో ప్రాథమిక అంచనాల ప్రకారం 2000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఐటీ శాఖ గుర్తించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ ఇంటిపై జరిపిన దాడులతో ఈ కుంభకోణం బయటపడింది. ఐటీ అధికారులు ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులను ఇచ్చినట్టు పత్రాలు సృష్టించి నిధులు దారి మళ్లించినట్టు గుర్తించారు. సోదాలు జరిపిన మూడు కంపెనీలు చంద్రబాబు, లోకేశ్ సన్నిహితులైన శ్రీనివాస్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, కిలారి రాజేష్ లకు చెందినవి కావడం గమనార్హం.