ఆటిజం పిల్లలకు జీవిత ఉపాధే లక్ష్యం... పినాకిల్ బ్లూమ్స్ విజయ ప్రస్థానం..!
థెరపీ సర్వీసులు :
ఆపరేషన్ తరువాత స్పీచ్ థెరపీ ఇప్పించాలన్నారు, థెరపీ సెంటర్ చూస్తేనే బాబు ఏడిచేవాడు, ఎలాగోలా థెరపీ సెంటర్ కి తీసుకువెళితే అక్కడ వాళ్ళు బాబు కి ఏ థెరపీ ఇస్తున్నారో ఏమీ చెప్పేవారు కాదు, రూమ్ లోకి తీసుకెళ్లవరు, బాబు ఏడుపు తప్పించి ఆ రూంలో థెరపీ ఏమి జరుగుతుందో తెలిసేది కాదు, ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్ కనపడడం లేదండి అని చెప్పినప్పుడు టైం పడుతుందండి అనేవారు, ఎంత టైం అనేదీ తెలియదు, మేమేమి చెయ్యాలో తెలియదు, వాళ్ళ థెరపీ ఏమిటో తెలియదు, ఒక రకంగా చెప్పాలంటే తల్లిగా, కుటుంబంగా మేమేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వచ్చింది,
పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్:
మా అబ్బాయి లా కొన్ని వేలమంది ఉన్నారని, ఆటిజం తో ఇబ్బంది పడుతున్నవారు కొన్ని కోట్ల మంది ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మందికి పైగా న్యూరోలాజికల్, సైకలాజికల్ కండిషన్లతో బాధపడుతున్నవారు ఉన్నారని అర్థం అయ్యింది వీరందరికీ, బంగారం లాంటి వారి భవిష్యత్తు కోసం, వారి కుటుంబాలలో ఆనందపు వెలుగులు నింపడానికి మొదలుపెట్టినదే పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్. దాదాపు మూడేళ్ళ రీసెర్చ్ తరువాత మొదటి సెంటర్ ను సుచిత్ర, బోయినపల్లి, హైదరాబాద్ లో రెండేళ్ల క్రితం మొదలు పెట్టడం జరిగింది, ఈ రోజు దాదాపు 14 సెంటర్లు హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాల్లో వేలమంది పిల్లలకు థెరపీ సర్వీసెస్ అందజేస్తున్నాయి।
ఇప్పటి వరకూ దాదాపు లక్షా పదిహేను వేలకు పైగా థెరపీ సర్వీసులను కండక్ట్ చెయ్యడం జరిగింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుప్రజలే కాకుండా, తమిళనాడు, బెంగుళూరు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ మొదలగు రాష్ట్రాలనుండి, అమెరికా, యూకే, లండన్, కువైట్, ఖతార్ వంటి దేశ, విదేశీయులు కూడా పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ యొక్క 98 % పైగా ఇంప్రూవ్మెంట్, 99 % పైగా కస్టమర్ సంతృప్తి ఉన్న సర్వీసెస్ వలన లాభం పొందారు.సేవ ఫౌండేషన్:
మా సంపాదన లో 33 % సమాజహితానికి ఇచ్చే కోటి గ్రూప్ లోని హెల్త్ టెక్ డివిజన్ అయిన భారత్ హెల్త్ కేర్ ప్రై లిమిటెడ్ సంస్థ యొక్క స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ యూనిట్ గా వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి, నెలవారీ వేతనం 25 వేలకంటే తక్కువ ఉన్నవారికి నెలవారీ థెరపీ ఫీజు 15 వేల రూపాయల్లో సేవ ఫౌండేషన్ వారి సహాయం ఇవ్వబడుతుందిఫ్రాంచైజ్ అవకాశాలు :
80 కోట్ల మందికి పైగా నాణ్యమైన న్యూరోలాజికల్, సైకలాజికల్ కండిషన్ థెరపీ, కౌన్సిలింగ్ సర్వీసులు అవసరమీరోజు, ఈ అవసరాన్ని తీరుస్తూ ఆటిజం కండిషన్ ఉన్న పిల్లల తల్లిదండ్రులకు నలుగురికీ మంచి చేస్తూ వారు మంచిగా ఉండేవిధంగా, వారి ఆటిజం కండీషన్ తో ఉన్న పిల్లలకు జీవిత ఉపాధి కల్పించడానికి రూపొందిచినదే ఈ పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ఫ్రాంచైజ్ అవకాశం..!