ఆరేళ్ళ చిన్నారిపై కన్నెర్ర చేసిన కామాంధులు.. పాపం కడుపు తరుక్కుపోతుంది..

Satvika

చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఆరేళ్ళ చిన్నారిపై అతి కిరాతకంగా అత్యాచారాని కి ఇద్దరు కామాంధులు విరుచుకు పడ్డారు. మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు అత్యాచారాని కి యత్నించిన ఘటన విశాఖ జిల్లాలో వెలుగుచూసింది. పరవాడ సమీపంలోని ముత్యాలమ్మపాలెం పంచాయతీ పరిధి తిక్కవానిపాలెంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.కామాంధుల రాక్షసత్వానికి చిన్నారి భయపడుతుంది. 

 


ఆరేళ్ల చిన్నారి స్థానికంగా ఓ పాఠశాలలో ఎల్‌కేజి చదువుతోంది. శనివారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలిక సాయంత్రం వేళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికను మాటల్లోకి దించారు. చాక్లెట్లు కొనిస్తామని మాయమాటలు చెప్పి పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. చిన్నారి పెద్దగా ఏడవడంతో స్థానిక మహిళలు కొందరు అక్కడికి చేరుకుని ఆ కామాంధులను పట్టుకుని చితకబాదారు.

 

 

విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి దండ్రులు అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో చితకబాదిన వారు ఇలాంటి బయట తిరిగితే తమ పిల్లలాంటి ఎందరో పిల్లలపై ఆఘాయిత్యాలకు పాల్పడతారని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

 


నిందితులిద్దరూ వివాహితులని, మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. వైజాగ్ సౌత్‌ ఏసీపీ రామాంజనేయులరెడ్డి పరవాడ స్టేషన్‌కు చేరుకుని నిందితులను విచారించారు. అయితే ఈ విషయం పై గ్రామస్తులు మాత్రం వారిని విడిచి పెట్టేదే లేదని పోలీస్టేషన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది.కామాంధుల చెర నుండి ఎలా బయటపడాలని కడుపులో నుండే పసికందు ఆవేదన చెందుతుంది. వావి వరుసలు లేని ఈ సమాజంలోకి రాలేనని దిగులు చెందుతుంది. ఈ విషయాన్నీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: