బికినీ వేసుకుందని దారుణంగా ప్రవర్తించారు.. బ్రిటిష్ నటికి చేదు అనుభవం
వివరాల్లోకి వెళితే కెసీలియా జస్ట్రెంబ్స్‌కా అనే బ్రిటీష్ యువతి మఫూసిలోని బీచ్‌లో బికినీ ధరించి సముద్రం ఒడ్డున ఎంజాయ్ చేస్తుంది. ఆమెను గమనించిన ముగ్గురు పోలీసులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి ఆమె శరీరాన్ని క్లాత్‌తో కప్పే ప్రయత్నం చేశారు. అయితే అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో వాళ్లు తనను ఏదో చేయబోతున్నారన్న అనుమానంతో యువతి అక్కడి నుంచి పారిపోబోయింది. దీంతో పోలీసులు ఆమెను గట్టిగా పట్టుకొని బేడీలు వేసేందుకు ప్రయత్నించారు. ఈ భయానక సంఘటనపై నటి స్పందిస్తూ తనను ఈ ఘటన ఎంతో వేదనకు గురి చేసిందని చెప్పింది. వాళ్లు నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారేమో అనుకున్నా. ఆ పెనుగులాటలో నాకు శ్వాస ఆగిపోయినంత పనైంది. నేను ప్రాణాలు పోయినట్టుగా అనిపించింది అని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై ఉన్నతాధికారులు స్పందించారు. అయితే ఆ బీచ్‌లో బికినీలతో సంచరించటం నిషేదం కావటంతో పోలీసులు అలా ప్రవర్తించారని తెలుస్తోంది.