యనమల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మామూలుగా లేదుగా ?

Vijaya
తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మామూలుగా లేవు.  ఇక్కడ యనమల రెండు అంశాల్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగారు. మొదటిదేమో ఐటి సోదాలైతే రెండో అంశమేమో శాసనమండలి రాజకీయాలు. మొదటి అంశం చూస్తే చంద్రబాబునాయుడు దగ్గర పిఎస్ గా చేసిన శ్రీనివాస్ దాడులతో చంద్రబాబుకు సంబంధం లేదని. శ్రీనివాస్ దగ్గర ఏమీ దొరకలేదని ఐటి శాఖ స్పష్టంగా చెప్పినా వైసిపి నేతలు  వినటం లేదు కాబట్టి పరువునష్టం దావా వేస్తారట.

తాము జరిపిన సోదాల్లో రూ. 2 వేల కోట్ల విలువైన అక్రమ లావాదేవీలకు ఆధారాలు దొరికినట్లు స్వయంగా ఐటి శాఖే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఐటి శాఖ దాడులు చేసింది మొత్తం తెలుగుదేశంపార్టి వాళ్ళపైనే. కాబట్టే వైసిపి ఐటి శాఖ రిలీజ్ చేసిన ప్రెస్ నోటును చంద్రబాబుకు ముడిపెట్టి ఆరోపణలు చేస్తోంది. సరే  ఈ విధంగా చంద్రబాబుపై ఆరోపణలు చేయటమే తప్పని అనుకుందాం ? మరి అదే విషయాన్ని స్వయంగా చంద్రబాబే ఎందుకు చెప్పటం లేదు ? గడచిన పదిరోజులుగా మీడియాను చంద్రబాబు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు ?

ఇక వైసిపి నేతల మీద పరువు నష్టం కేసును చూద్దాం. జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు దోచేశాడంటూ పదేళ్ళుగా ఆరోపణలు చేస్తునే ఉన్నారుగా అందరూ కలిసి. మరి చంద్రబాబుతో పాటు పార్టీ మొత్తం మీద వైసిపి వాళ్ళు ఎన్ని పరువునష్టం కేసులు వేయాలి ?

సరే రెండో విషయమైన మండలి విషయానికి వస్తే ఛైర్మన్ చెప్పినట్లు నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటి నియమించటం సాధ్యం కాదని కార్యదర్శి స్పష్టంగా రెండుసార్లు రాత మూలకంగా  చెప్పారు. అయినా సెలక్ట్ కమిటి ఏర్పాటును కార్యదర్శి తిరస్కరించలేదని యనమల అబద్ధాలు చెప్పటమే  ఆశ్చర్యంగా ఉంది. పైగా కార్యదర్శి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సుంటుందని బెదిరింపులొకటి. మొత్తం మీద తాము అనుకున్నది కుదరదని అనుకున్నపుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగటమే టిడిపికి తెలిసిందని అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: