హవ్వ, పే-ద్ద కండోమ్ ప్యాకెట్ కొన్న 76ఏళ్ల వృద్ధురాలు... ఎందుకో తెలిస్తే మీ నవ్వు ఆగదు!
వారం రోజుల క్రితం రోజ్ మ్యారి అనే 76 ఏళ్ల వృద్ధురాలు అస్సాదా అనే పేరుగల ఒక కిరాణా స్టోర్ కి వెళ్ళి తనకి అవసరమైన సరుకులను కొనుగోలు చేసింది. ఆ తర్వాత బిల్లు కట్టేసి ఇంటికి వచ్చేసింది. అయితే ఆమె కొనుగోలు చేసిన సరుకులలో ఒక ఐటమ్ చూసి తన భర్త ఒక్కసారిగా కంగుతిన్నాడు. 'రోస్, నీకు ఇదే మాయదారి రోగమే. ఈ వయసులో కండోమ్ ప్యాకెట్ కొనడం ఏమిటే, అని ఆశ్చర్యపోతూ అడిగాడు. 'ఏం మాట్లాడుతున్నావ్ నేను కండోమ్ ప్యాకెట్ కొనడమేంటి!', అని ఆమె సమాధానమిచ్చింది.
దీంతో ఆ భర్త ఆమె కొన్న సరుకుల నుండి ఒక డ్యూరెక్స్ అల్ట్రా థిన్ కండోమ్స్ ప్యాకెటును బయటికి తీసి చూపించాడు. అది చూసిన ఆ వృద్ధురాలు ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో తలదించుకుంది. వెంటనే తాను ఆ కండోమ్స్ ప్యాకెటును ఉద్దేశపూర్వకంగా కొనలేదని చెప్పుకొచ్చింది. దీనంతటికీ కారణం కిరాణా స్టోర్ కి వెళ్లేటప్పుడు ఆమె తన కళ్ళజోళ్ళను ధరించకపోవడం అని రోస్ మ్యారి చెప్పింది. 'మరి ఏమనుకోని ఏమి కొన్నావ్?', అని భర్త ప్రశ్నించగా... టేట్లి టీ పొడి ప్యాకెటును కొనాలని తను అనుకున్నదని కానీ కళ్ళు సరిగ్గా కనిపించక ఎర్రగా ఉన్న డ్యూరెక్ ప్యాకెటుని కొన్నానని వివరించింది.
వాస్తవానికి దాని విలువ £17 అనగా మన కరెన్సీలో రూ.1600 అన్నమాట. దీంతో రోస్ మ్యారి తనకి అవసరం లేని కండోమ్స్ ప్యాకెటుని తిరిగి ఇచ్చేసి టీ పొడిని తీసుకోవాలనుకుంది. ఈ విషయంలో తన మనవరాలైన జమ్మని సాయం చేయమని అడిగింది. దీంతో విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి ఓ పది నిమిషాల పాటు నవ్వుకొని ఆ తర్వాత అస్సాదా కిరాణా స్టోర్ కి వెళ్లి జరిగిందంతా చెప్పింది. దాంతో వాళ్లు కూడా నవ్వుకొని ఆ తర్వాత టీ పొడి ప్యాకెటుని జమ్మకు ఇచ్చి పంపించేశారు. ఈ తతంగమంతా జమ్మ తన ఫేసుబుక్ కథలో షేర్ చేసింది. ఇకమీద తన అమ్మమ్మని కిరాణా షాప్ కి పంపించమని, పంపిస్తే ఈసారి ఏమి ఇంటికి తీసుకు వస్తుందో అని ఆమె హాస్యమాడింది. చివరికి రోస్ మ్యారి మాట్లాడుతూ... తన భర్త కి ఒంట్లో బాగోలేదని అందుకే ఆమె కిరాణా షాప్ కి వెళ్ళాల్సి వచ్చిందని, అలాగే తనకి షాపింగ్ చేయడం చేతకాదని చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఈ హాస్యభరితమైన ఫేసుబుక్ పోస్టు నెట్టింట హల్ చల్ చేస్తోంది.