హేయ్.. ఈ 'ఆక్టోపస్'ని చూశారా ? ఎంత బాగా హాయ్ చెప్తుందో!
అవును మీరు ఆక్టోపస్ ను ఎప్పుడైనా చూశారా? అంటే నెట్ లో.. ఫోటోలో కాకుండా ఎప్పుడైనా చూశారా? చాలామంది చూసి ఉండరు లెండి! ఎందుకంటే? ఇది అరుదైన ప్రాణి కదా! అందుకే మీరు చూసి ఉండరు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఆక్టోపస్ ను చూస్తే మాత్రం ఒక్కసారిగా షాక్ కు గురవుతారు.
ఎందుకంటే ఈ ఆక్టోపస్ హాయ్ చెప్తుంది.. అది చెప్పే హయ్ ని చూస్తే ఎవరైనా షాక్ గురవుతారు. మాములుగా అయితే మన ఇంట్లో ఉన్న పిల్లి లేదా కుక్కలకు మనం హాయ్ చెప్పడం.. థాంక్స్ చెప్పడం నేర్పిస్తే అవి నేర్చుకొని చెప్తాయి. అయితే ఇప్పుడు ఆక్టోపస్ చెప్పడంతో ఇవి కూడా మన పనులు చేస్తాయా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
నిజానికి ఆక్టోపస్‌లు మనుషులు చేసే పనులు అనుకరిస్తాయని కొంతమంది చెబుతుంటారు. అయితే అది నిజం అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఆక్టోపస్‌కు చేతులు ఊపాడు. అది చూసిన ఆక్టోపస్ దానికి ప్రతిస్పందనగా తన చేతులను కూడా ఊపింది.. ఇది అంత కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో ఆ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఇక.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో ఆ వీడియోను చుసిన నెటిజన్లు అంత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. వావ్.. ఈ ఆక్టోపస్ ఎంత క్యూట్ అని ఒకరు అంటే.. మరొకరు దానికి స్పందిస్తూ.. క్యూట్ గా ఉంది అని నువ్వు ముద్దు పెడితే అది కూడా నీకు ముద్దు పెడుతుంది.. అప్పుడు డాక్టర్ ని సంప్రదించాల్సి వస్తుంది అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ఇలా ఆక్టోపస్ హాయ్ చెప్పడం ఆశ్చర్యకరమైన విషయమే.
The octopus is one of the most intelligent animals on the planet. Here’s one copying a wave “hello” pic.twitter.com/DUit3H8DBe — Nature is Lit🔥 (@NaturelsLit) February 22, 2020