రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా అధికారపార్టీ, ప్రధాన ప్రతిపక్షం అన్నది సహజం. మొత్తం రాజకీయమంతా ప్రధానంగా ఈరెండు పార్టీల మధ్యే నడుస్తుంటుంది. కానీ ఏపిలో మాత్రం రాజకీయమంతా విచిత్రమైన పద్దతిలో నడుస్తోంది. ఎలాగంటే అధికారపార్టీ వైసిపిని తట్టుకోలేక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ సైడయిపోయింది. దాంతో ప్రధాన మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి ముందుకొచ్చాయి.
చంద్రబాబునాయుడు, పై మీడియా యాజమాన్యాల మధ్య ఉన్న సంబంధాల గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి పై రెండు మీడియాలకు బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ దశలో కూడా చంద్రబాబు వైసిపిపై ఒత్తిడి తేలకపోతున్నారు. అందుకనే టిడిపిని సైడ్ చేసేసి జగన్మోహన్ రెడ్డిపై దండెత్తే బాధ్యత పై రెండు మీడియాలు భుజానేసుకున్నాయి.
పై రెండు మీడియాలకు అంత అవసరం ఏమిటంటే చంద్రబాబు అధికారంలో లేకపోతే వీళ్ళాటలు సాగవు. అదే సమయంలో జగన్ ను అధికారంలో నుండి దింపేయకపోతే ఈ మీడియాకు భవిష్యత్తంతా ఇబ్బందే. అందుకనే ప్రతిరోజు జగన్ కు వ్యతిరేకంగా కథనాలు వరుసగా అచ్చేస్తునే ఉన్నాయి. అంటే జగన్ ను అర్జంటుగా అధికారంలో నుండి దింపటం సాధ్యంకాదు కాబట్టే గబ్బు పట్టించే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ కారణంతోనే జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, టిడిపి కన్నా ఈ మీడియానే రెచ్చిపోతోంది.
ఎలాగన్నా సరే జగన్ పై బురద చల్లాలనే టార్గెట్ తోనే జగన్ వ్యతిరేకులకందరికి తమ మీడియాలో విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. మొత్తానికి జగన్ పై జనాల్లో లేని వ్యతిరేకతను ఉందని చెప్పటానికి ఈ మీడియా పడుతున్న అవస్తలు చూస్తుంటే జాలేస్తోంది. జగన్ పోరాటం చేస్తోంది ప్రతిపక్షాలతో కాదు మీడియాతోనే అన్నది అందరూ గ్రహించారు. మరి ఈ పోరాటంలో చివరకు ఎవరు గెలుస్తారో చూడాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: