హరీష్‌రావు కొత్త నియోజకవర్గం పై కన్నేశారా... అక్కడ మనసు లాగుతోందా...!
ఇక ఇప్పుడు హరీష్ రావు కన్ను మరో నియోజకవర్గం పై పడినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ నియోజకవర్గం ఏంటనుకుంటున్నారా ? సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు హరీష్ రావు. ఈ రెండు నియోజకవర్గాల్లో మొన్న అధికార పార్టీ గెలుపులో హరీష్ రావు ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు హరీష్ రావు సిద్ధిపేటను మినహాయిస్తే సంగారెడ్డి పైనే ఎక్కువుగా కాన్సంట్రేషన్ చేస్తున్నారట.
సంగారెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య క్యాడర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారట. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక సీటు సంగారెడ్డి. అంతే కాకుండా ఇక్కడ జయప్రకాష్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సమయంలో హరీష్ రావును బహిరంగంగా దూషించారు. దీంతో జయప్రకాష్ రెడ్డికి ఎలాగైనా షాక్ ఇవ్వాలనుకున్న హరీష్ రావు పట్టుబట్టి మరీ ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేశారు.
ఇక వచ్చే ఎన్నికల నాటికి సిద్ధిపేటలో అవసరమైతే తన భార్యను అయినా పోటీ చేయించి.. తాను సంగారెడ్డిలో పోటీ చేసి అయినా జయప్రకాష్ రెడ్డిని ఓడించి.. ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలకాలన్ననంత కసితో హరీష్ రావు ఉన్నారట. అందుకే ఆయన ఇక్కడ బాగా ఫోకస్ చేస్తున్నారన్న వార్తలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. మరి హరీష్ మనస్సులో ఏముందో ? చూడాలి.