'ముద్దేంకర్మ నన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకో' అని అన్న కామాంధురాలి చెంప పగలగొట్టిన రోజా..!

Suma Kallamadi

వివాహం చేసుకున్న ఎంతోమంది వ్యక్తులు ఏడడుగులు నడిచిన భార్యకి, భర్తకి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా... పక్కదారి పడుతూ ఇతరులతో తమ శారీరక వాంఛలను తీర్చుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే అక్రమ సంబంధాల గుట్టు రట్టవుతుందో అప్పటినుండి దంపతుల మధ్య తగాదాలు, గొడవలు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుత సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న ఇటువంటి అక్రమ సంబంధాల వలన ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టి చాలామంది కాపురాన్ని తీర్చిదిద్దేందుకు వైసిపి ఎమ్మెల్యే రోజా బతుకు జట్క బండి కార్యక్రమంలో హోస్టుగా బాధ్యతలు నిర్వహిస్తూ తన వంతు కృషి చేస్తోంది.




ఐతే, తాజాగా బతుకు జట్కా బండి కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదలై సామాజిక మాధ్యమాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రోమోలో ఒక మహిళ తనకి పెళ్లి కాకముందే ఒక వ్యక్తితో రాసలీలలు చేసి... పెళ్లయిన తర్వాత కూడా తన రాసలీలలు ఇంకా కొనసాగిస్తుంది. అయితే అనుమానం వచ్చిన భర్త తన భార్య ఫోనులోని కాల్ రికార్డింగ్ లను వినగానే తను మోహన్ అనే ఒక వ్యక్తితో పచ్చి బూతులు మాట్లాడుతుందని తెలుస్తోంది. దీంతో ఆ దంపతుల మధ్య గొడవలు మొదలవుతాయి. అయితే భార్య చేతిలో మోసపోయిన భర్త తనకు న్యాయం చేయాలంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయిస్తాడు.




ఈ ప్రోమోలో భర్త రోజాకి తన గోడును చెప్పుకుంటూ... 'నాకు పాయసం తినడం అంటే చాలా ఇష్టం. ప్రతి వారం నా భార్య తో పాయసం చేయించుకొని తింటాను. అయితే ఒక రోజు పాయసం కోసం సరుకులు తెమ్మని ఆమెను బయటికి పంపించాను. కానీ ఎంత సమయం గడిచినా ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆమె ఫోనుని పరిశీలించడం ప్రారంభించాను. అప్పుడే నాకు ఒక కాల్ రికార్డింగ్ దొరికింది. అందులో నా భార్య మోహన్ అనే ఒక వ్యక్తి తో పచ్చి బూతులు మాట్లాడుతుంది. వాడు ముద్దు కావాలి అని అడిగితే... 'ముద్దేంకర్మ ఇష్టం వచ్చినట్టు వాడుకో' అని నా భార్య అంటుంది', అంటూ బాధపడ్డాడు.




ఇదంతా వింటున్న రోజా పెళ్లయిన తర్వాత కూడా రాసలీలలు కొనసాగిస్తున్న భార్యపై మండిపడింది. అయితే ఆ భార్య తాను ఎవరితో మాట్లాడట్లేదని దబాయించింది. దీంతో రోజా కాల్ రికార్డింగ్ ప్లే చేసింది. ఆ కాల్ రికార్డింగ్ లో ఆమె మోహన్ తో మాట్లాడుతూ 'ఏది పడితే అది తిని పొట్ట పెంచకు.. చూడలేక చచ్చిపోతున్న. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకు. మా ఆయనకు ఏమీ మాట్లాడటం రాదు. పొద్దుందాక ఎప్పుడు ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు' అని అంటుంది. మోహన్ కూడా మాట్లాడుతూ... నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగితే... 'ముద్దేంకర్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకో' అని ఆమె అంటుంది. దీంతో కాల్ రికార్డు ముగిస్తుంది.



దీంతో రోజా ఆమె మొహం చూస్తూ ఉంటుంది. అప్పడు ఆమె అమాయకంగా మొహం పెట్టి 'ఏమో మేడం నాకు ఏ అఫైర్ లేదు', అంటుంది. దీంతో ఆగ్రహించిన రోజా ఆమె చెంప చెల్లు మనిపించినడానికి తన సీట్ లో నుండి పైకి లేస్తుంది. అయితే వీరిద్దరిని ఒకటి చేశారా లేదా అనేది బతుకు జట్కా బండి కార్యక్రమం పూర్తిగా తెలియదు చూస్తే కానీ తెలియదు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: