కారు విలువ ఐదు లక్షలు.. నెలకు రూ.1600 కడితే చాలు..!
రాబోయేదంతా ఎలక్ట్రానిక్ కార్ల యుగం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్స్‌కు వచ్చే సరికి బేసిక్ మోడలే పది లక్షలు పైన చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ ... చౌక ధరలో ఎలక్ట్రానికి కారుని తయారు చేసింది. దీని ధర ఐదు లక్షల లోపే.
ఈ బుల్లి కారు పేరు.. ఎమి. వాషింగ్ మెషీన్ కంటే కాస్త పెద్దగా కనిపిస్తున్న ఈ బుజ్జి కారు ధర 6వేల యూరోలు. మన కరెన్సీలో 4లక్షల 47వేల రూపాయలు. ఈ ధరలో ఎలక్ట్రానిక్ కారు అందించడం చాలా కష్టం. ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ సిట్రోన్.. ఈ బుజ్జి కారుని తయారు చేసింది. ఇందులో ఇద్దరు కూర్చోవచ్చు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.
కారులో 8 హార్స్పవర్ మోటర్తో నడుస్తుంది. బ్యాటరీని చార్జ్ చేసేందుకు 6కేవీ {{RelevantDataTitle}}