వైరల్: అబార్షన్ చేయించుకుంటూ ఆ వీడియోని టిక్ టాక్ లో పెట్టిన ఓ యువతి..!
టిక్ టాక్ ఎప్పుడైతే ప్రజలకి అందుబాటులోకి వచ్చిందో అప్పటినుండి నేటి యువత తమ పిచ్చిని ప్రపంచానికి ప్రతిరోజు చూపుతూనే ఉన్నారు. ఇప్పటికే టిక్ టాక్ లో జరిగే ఎన్నో ఘోరాలు నెట్టింట వైరల్ అయ్యి అందర్నీ విస్తుపోయేలా చేశాయి. ఐతే తాజాగా టిక్ టాక్ లో ఒక షాకింగ్ ఛాలెంజ్ ని ఇద్దరమ్మాయిలు స్టార్ట్ చేసి కోట్ల మంది ఆగ్రహానికి కారణమవుతున్నారు.
విషయానికి వస్తే... మ్యారి అనే పేరు గల ఒక అమెరికన్ టిక్ టాక్ యూసర్ (@cpcake21) 20 సెకండ్ల నిడివిగల ఓ వీడియో క్లిప్ ని టిక్ టాక్ లో అప్లోడ్ చేసి నెట్టింట పెద్ద దుమారం రేపుతోంది. ఆ 20 సెకండ్ల వీడియో క్లిప్ లో ఏం కనిపించిందంటే... మొదటిగా మ్యారి తన ఫ్రెండ్ అయిన ఆశ్లీ యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ 'పాజిటివ్' రిజల్ట్ ని చూపిస్తుంది. తర్వాత ఆశ్లీ తన గర్భాన్ని అద్దంలో చూసుకుంటూ కనిపిస్తుంది. ఆపై ఈ ఇద్దరు స్నేహితురాలు కలసి ఒక ప్లానెడ్ పేరెంట్ హుడ్ క్లినిక్ కి వెళ్తారు. అక్కడ ఆశ్లీ కాసేపు సోఫా లో కూర్చొని తను ఏదో పెద్ద ఘనకార్యం చేయించుకోవడానికి వెళ్తున్నట్టు గాలిలో పంచెస్ విసురుతూ కనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే ఆపరేషన్ థియేటర్లో ఆమె ఒక మెడికల్ గౌన్ ని ధరించి ఒక బల్లపై పడుకుంటుంది. అప్పుడు ఓ లేడీ డాక్టర్ ఆమె గర్భాన్ని పరిశీలిస్తూ అబార్షన్ చేసేందుకు సిద్ధమవుతోంది.
These abortion celebration TikTok videos are something else 🤣.
If you want to abort your kid and kill your own offspring I’m not going to be the one to stop you, but why do these chicks celebrate abortions as if they’re collecting Pokémon gym badges?
pic.twitter.com/Fr5eDvzIHJ — Austere Revered Wizard Will 🧙♂️🍀 (@prophetw205) February 28, 2020
అదృష్టవశాత్తు ఆశ్లీ తన పూర్తి అబార్షన్ ప్రొసీజర్ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూపించలేదు కానీ పెళ్లికాకముందుకే గర్భం తెచ్చుకొని... ఆ గర్భంలో పెరుగుతున్న పసి బిడ్డలని అబార్షన్ ద్వారా నిర్దాక్షిణ్యంగా చంపేయడం చాలా పాపమని అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. అయితే ఆశ్లీ మాత్రం అబార్షన్ చేయించుకుంటూ తను ఏదో ఒక ఫెస్టివల్ జరుపుకుంటున్నట్టు సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ టిక్ టాక్ వీడియో ట్విట్టర్లో ఓ పెద్ద చర్చకు దారి తీసింది. నేటి సమాజంలోని యువత ఇంత ఘోరంగా మారుతున్నారని తెలుసుకుంటుంటే ఒళ్ళు జలదరిస్తుందని నెటిజనులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.