ఈ నక్క చేసిన చిలిపి పని చూస్తే.. పగలబడి నవ్వుకుంటారు..
సాధారణంగా అడవిలో సింహం అంటే చిన్న పెద్ద జంతువులకు హడల్.. సింహం గాండ్రింపు వింటే కొన్ని జంతువులు భయంతోనే చచ్చిపోతాయని అంటారు. ప్రపంచంలోనే అతి కృర మృగమైన సింహం దరిదాపుల్లోకి వెళ్లాలంటే గజ గజ వణికి పోతుంటారు. అయితే చిన్న పిల్లల చదువుకునే కథల పుస్తకాల్లో సింహం గురించి ఫన్నీగా చెబుతుంటారు. సింహం, నక్క కథలు ఎన్నో రకాలుగా చదువుకున్న విషయం తెలసిందే. అడవికి రాజు అయిన సింహాం కొన్ని సార్లుజిత్తుల మారి నక్క మాటలు నమ్మ బొక్కబోర్లా పడుతుంది. అడవిలో సింహానికి రారాజుగా పేరు ఉంటే.. తెలివి తెటలతో ఎలాంటి జంతువునైనా ఇట్టే బురిడీ కొట్టించగలది జిత్తుల మారి నక్క. అయితే ఇది పుస్తకాల్లో చదువుకోవడానికి బాగానే ఉంటుంది... చిన్న పిల్లల చిత్రాల్లో కార్టున్స్ లో చూడటానికి బాగానే ఉంటుంది.
కానీ నిజమైన అడవిలో సింహం దరిదాపుల్లోకి ఏ జంతువూ వెళ్లదు. ముఖ్యంగా ఆకలితో ఉన్న కృర మృగాల స్థానంలోయి ఎంత పెద్ద జంతువులు కూడా వెళ్లవు.. వెళ్లితే అవి వేటాడుతాయని తెలుసు. అయితే ఓ నక్క హాయిగా పడుకున్న సింహాన్ని తన చిలిపి పనితో ఎలా డిస్ట్రబ్ చేసిందో చూస్తే పగలబడి నవ్వుకుంటారు. నిజంగా నక్క జిత్తులమారిదే.. అని మరోసారి రుజువు చేసుకుంది. పొదల వద్ద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న సింహం తోక ఊపుతూ ఉంది. అయితే దాని తొక సమీపానికి వచ్చిన ఓ నక్క అది చిలిపితనమో, ధైర్యమో తెలీదుగానీ.. లేక ఓ పిట్ట అనుకుందో ఏమో తెలియాదు కానీ దాన్ని కొరికే ప్రయత్నం చేసింది.
అంతే ఒక్కసారిగా సింహం లేచింది.. దాంతో అక్కడ నుంచి నక్క పరుగో పరుగు. అయితే అది సింహ తోక అనుకుందా.. లేదా ఏదైనా పక్షి ఎగురుతూ ఉందా అనుకుని ఉంటుందని నెటిజన్లు అనకుంటున్నారు. తోకను చూసి అదేదో జంతువు అనుకుని పొడబడిందో ఏమోగానీ.. నక్క చేసి కొంట పనికి అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పురడు భలే వైరల్ అయ్యింది.