బాబోరి మ‌రో డ్రామా ఫెయిలైందా... అక్క‌డ సీన్ రివ‌ర్స్ అయ్యిందే... !

VUYYURU SUBHASH
సానుభూతి.. టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా న‌మ్మిన ప‌దం.. ఎక్కువ‌గా అనుస‌రించే ప‌దం కూడా ఇదే! ఎక్క‌డ ఏం జ‌రిగినా.. త‌నపై ప్ర‌జ‌ల్లో సానుభూతి ప‌వ‌నాలు వీచేలా దానిని మ‌ల‌చ‌డంలో ఆయ‌న ముందుంటారు. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్‌పై విశాఖ విమానాశ్ర‌యంలో కోడి క‌త్తి దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా బాధితుల‌కు ద‌క్కాల్సిన సానుభూతిని మ‌రోకోణంలో త‌న ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అంతెందుడు 2004లో త‌న‌పై తిరుప‌తి స‌మీపం లోని అలిపిరిలో మావోయిస్టులు దాడులు చేసినప్పుడు దానిని సానుభూతి కోణంలో చూపించి తిరిగి మూడోసారి కూడా ఎన్ని క‌ల్లో విజ‌యం సాధించాల‌ని ప్ర‌య‌త్నించారు. వెనువెంట‌నే ఆయ‌న త‌న  ప్ర‌భుత్వాన్ని ముందుగానే ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లారు.



రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. గుంటూరులో త‌న పార్టీ నేత‌ల‌పై ముఖ్యంగా ద‌ళిత వ‌ర్గాల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో దాడులు చేస్తోంద‌ని ఊరూవాడా ప్ర‌చారం చేసి త‌న‌కు సానుభూతి పొందేందుకు ప్ర‌చారం చేసారు. ప్ర‌జావేదిక కూల్చిన ఘ‌ట‌న‌ను కూడా త‌నకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఇప్పుడ 75 రోజులుగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యాన్ని కూడా సానుభూతి కోణంలో నిర్వ‌హించేందుకు తెర‌వెనుక అన్నీతానై న‌డిపిస్తున్నారు. అయితే, ఈ సానుబూతి ఎన్నాళ్లు ప‌నిచేస్తుంది?  అసలు ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబుపై సానుభూతి ఉందా? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్ అంశాలు. సానుభూతి కోణంలో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు విజ‌యం సాధించాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన విష‌యాన్ని లేవనెత్తుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ ఆయ‌న మ‌హిళ‌ల‌ను సానుభూతి కోణంలోనే చూశారు.



ప‌సుపు-కుంకుమ రూపంలో మ‌హిళ‌ల‌కు విడ‌త‌ల వారీగా న‌గ‌దు పంచారు. అయితే, అది కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌రిగిన విశాఖ ఘ‌ట‌న ద్వారా అయినా సానుభూతి వ‌స్తుంద‌ని బాబు ఆశించార‌ని తెలుస్తోంది. విశాఖ‌లో ఆయ‌న ప‌ర్య‌టించాల‌ని అనుకున్నారు. పైకి చెప్పిన రీజ‌న్ మాజీ మంత్రి అయ్య‌న్న‌కుమారుడి వివాహానికి హాజ‌రుకావ‌డం స‌హా అక్క‌డి చెరువులను, భూముల‌ను వైసీపీ నాయ‌కులు క‌బ్జాచేస్తున్నార‌ని, వాటి విష‌యం తేలుస్తాన‌ని, అందుకే విశాఖ‌లో పర్య‌టిస్తున్నాన‌ని అన్నారు. కానీ, విశాఖ‌ను రాజ‌ధానిగా ప్ర‌క‌టించినా.. అక్క‌డి ప్ర‌జ‌లు ఆహ్వానించ‌లేద‌నే విష‌యాన్ని, మూడు రాజ‌ధానుల‌కు అక్క‌డి ప్ర‌జ‌లు కూడా వ్య‌తిరేకంగా ఉన్నార‌ని చెప్పాల‌నేది తెర‌వెనుక వ్యూహం. మొత్తానికి ఇది విమానాశ్ర‌యంలోనే విఫ‌ల‌మైంది.



దీంతో ఆయ‌న వెంట‌నే అక్క‌డే సానుభూతి కోణంలో త‌న పూర్వ చ‌రిత్ర‌ను చెప్పుకొచ్చారు. 25 ఏళ్లుగా టీడీపీకి అధ్య‌క్షుడిన‌ని, 14 ఏళ్ల సీఎంన‌ని, 11 ఏళ్ల ప్ర‌తిప‌క్ష నాయకుడిన‌ని అలాంటి న‌న్ను పోలీసులు అడ్డ‌గిస్తారా? అంటూ రుస‌రుస‌లాడారు. ఇలా ఇంత‌గా ఆయ‌న సానుభూతి మ‌సాలా ద‌ట్టించినా.. దీనిపై ప్ర‌జ‌ల్లో ఎక్క‌డా చ‌ర్చ లేక‌పోవ‌డం ఇప్పుడు టీడీపీ శ్రేణుల‌ను దిగాలు ప‌డేలా చేసింది. ఏదేమైనా.. సానుభూతి క‌న్నా ప్ర‌జ‌ల అభిమానాన్ని సంపాయించ‌డంలో బాబు విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న మాత్రం నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై ఆయ‌న ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: