బ్రహ్మణి వస్తే టీడీపీ పట్టాలెక్కినట్టేనా... ?

Chakravarthi Kalyan
తెలుగుదేశం పార్టీకి చాలా చరిత్ర ఉంది. 1982లో ప్రాణం పోసుకున్న ఈ పార్టీది దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర.. అందులోనూ అత్యధిక కాలం అధికారంలో ఉన్న చరిత్ర ఈ పార్టీది. ఒకప్పుడు ఎన్టీఆర్ నాయకత్వంలో ఒక వెలుగు వెలిగిన ఈ పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలోనూ మనగలిగింది. కానీ ఓ వైపు చంద్రబాబుకు వయసైపోతుండటం.. మరోవైపు అధికారం కోల్పోవడం ఆ పార్టీని చిక్కుల్లో పడేశాయి.

చంద్రబాబు తర్వాత ఎవరు.. ఈ ప్రశ్న ఇప్పుడు టీడీపీ శ్రేణులను వేధిస్తున్నది. ఈ ప్రశ్నకు సమాధానంగా లోకేశ్ ను తయారు చేద్దామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొట్టాయి. చంద్రబాబు పుత్రప్రేమ ఇప్పుడు ఏకంగా పార్టీ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేసింది. లోకేశ్ ను నాయకుడిగా మలచాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. చివరకు సొంతంగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన వ్యక్తి ఇక పార్టీని ఏం నడిపిస్తాడన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఇలాంటి సమయంలో చంద్రబాబు మరో ప్రయోగానికి తెర తీస్తున్నట్టు కనిపిస్తోంది. ఎలాగూ లోకేశ్ ప్రయత్నం విఫలమైంది. కానీ పార్టీలో మరో యువనేతకు పగ్గాలు అప్పగించే ఆలోచన ఎలాగూ లేదు. తెలుగుదేశం అంటే నారా- నందమూరి కుటుంబాల ఉమ్మడి ఆస్తిగా చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. ఈ దశలో ఆయనకు ఆశాకిరణంగా కనిపిస్తోంది కోడలు నారా బ్రహ్మణి.

ఇప్పుడు ఆమె నాయకురాలిగా తీర్చిదిద్ది పార్టీని ఆమె చేతిలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు గతంలోనూ కథనాలు వచ్చినా అందుకు తగిన ఆధారాలు అప్పట్లో కనిపించలేదు. కానీ ఇప్పుడు తాజాగా నారా బ్రహ్మణి ఆధ్వర్యంలో పార్టీ యువ నాయకత్వాన్ని సమావేశపరిచి.. విందు రాజకీయం చేసిన తీరు చూస్తే.. ఇక తెలుగుదేశానికి భవిష్యత్ నాయకురాలిగా బ్రహ్మణి కీలకపాత్ర పోషించబోతోందని అర్థం అవుతోంది. మరి ఈమె ఎంతగా రాణిస్తారు.. నారా లోకేశ్ వల్ల కానికి నారా బ్రహ్మణి వల్ల అవుతుందా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: