కరోనా ఎఫెక్ట్ : ఇకనుంచి ఇంట్లోనే రెండు నిమిషాల్లో మాస్క్ తయారు చేసుకోండి ఇలా..?
ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్... రోజురోజుకు మరింతగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా దేశంలో మరణ మృదంగం వాయిస్తూ 3200 మందిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రాణాంతక వైరస్. అంతే కాకుండా మరో 80 వేల మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. చైనాలో విజృంభిస్తు ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వరుసగా సరిహద్దులు కూడా దాటేస్తుంది. దీంతో అన్ని దేశాలు హైఅలర్ట్ ప్రకటిస్తున్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ముఖానకి మాస్కులు పెట్టుకోవడం శానిటైసర్లు ఉపయోగించడం లాంటివి చేస్తూ ఉన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా మాస్కుల వినియోగం పెరగడంతో మాస్కుల కొరత ఏర్పడింది. కొన్ని నగరాల్లో అయితే మాస్కులు పూర్తిగా కరువైన పరిస్థితి ఏర్పడింది. కనీసం మెడికల్ షాపుల్లో కూడా మాస్కులు దొరకని పరిస్థితి. అయితే ప్రపంచవ్యాప్తంగా మాస్క్ లను సరఫరా చేసే చైనా కంపెనీలు ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్టుతో మూతపడడంతో రోజురోజుకు మరింతగా మాస్కుల కొరత పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఉపయోగించుకోవడానికి ఇంట్లోనే ఒక మాస్క్ ను తయారు చేయొచ్చు అని అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.దీంతో గత రెండు రోజుల నుండి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టిష్యూ పేపర్ లేదా బలమైన బట్టతో 2 నిమిషాల్లో మాస్క్ రెడీ చేయొచ్చు. రెండు రబ్బర్ లు 4 పిన్నులు టిష్యూ పేపర్ తో సులభంగా మాస్క్ ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటూ ఈ వీడియో అందరికీ అవగాహన కల్పిస్తోంది. కరోనా ఎఫెక్టుతో ప్రపంచ వ్యాప్తంగా మాస్కులు కొరత ఏర్పడిన నేపథ్యంలో.. వీడియో లో చూపిన విధంగా మార్పులు తయారు చేసుకుంటే బాగా ఉపయోగపడుతుంది.