బాబుకు ‘బై’ రెడ్డి

తెలుగుదేశం అధినేత బాబుకు బై..బై చెబుతున్న వారు అధికమవుతున్నారు. కుటుంభ పాలనలో కుతంత్రాలను తట్టుకోలేక కొందరు పార్టీ వీడుతున్నారు. నందమూరి అభిమానులు ‘నారా’వారి వేధింపులు తాళలేక మరికొందరు వలసబాట పడుతున్నారు. అలాగే ప్రత్యేక వాదం మరికొందరి పార్టీని వీడేలా చేస్తోంది.  అధికారం అంచులలో ఉన్నామని భావిస్తున్న ‘బాబు’కు సీమలో బైరెడ్డి బై..బై చెప్పేందుకు సిద్ధమవుతున్న సమాచారం తెలిసింది. బలోపేత దిశగా పయనిస్తున్న తెలుగుదేశం వలసల వేటుకు తిరిగి బల‘హీనంగా’దీనస్థితికి చేరుకుంటోందని ‘నారా’నోరెళ్లబెడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాయలసీమ నేత బైరెడ్డి బహిరంగంగా విమర్శిస్తున్నారు. తెలంగాణపై తేల్చిచెప్పేముందు సీమ సంగతి తేల్చాలని బైరెడ్డి పట్టుపడుతున్నాడు.  తెలంగాణ వాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై బైరెడ్డి చంఢ్రనిప్పులు కక్కుతున్నాడు. తెలుగుదేశంలోనే ఉంటూ అధినేతను బైరెడ్డి విమర్శించడాన్ని పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో బైరెడ్డిపై ఇటు తెలంగాణ నేతలు మరోవైపు ఆంధ్రనాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అయితే అక్టోబర్ 2నుంచి చంద్రబాబు చేపట్టనున్న యాత్రకు ధీటుగా తానుకూడా రాయలసీమలో పాదయాత్ర చేపడుతున్నానని బైరెడ్డి బహిరంగ ప్రకటన చేశాడు. నిజాం పాలనతో తాము నిరసించిపోయామని అలాగే ఉమ్మడి మద్రాస్ హయాంలోతమిళులతో తన్నులు తిన్నామని అలాగే విశాలాంధ్రతో విసిగిపోయామని వివరించారు.  కాగా తాము ఆత్మగౌరవంతో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తో ముందుకు సాగుతున్నామంటున్నారు. ఇదిలాఉండగా రాయలసీమలో వైకాపా ప్రభావం అధికంగా ఉన్న విషయం బాబుకు తెలిసిందే. దీంతో ఉన్న కొద్దిపాటి బలమైన నేతలు పార్టీ విడిచి బయటికి పోతే ఎలా?అని బాబు అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై ఆలస్యంగా స్పందించిన కారణంగా బడా నేతలను కోల్పోయిన చంద్రబాబు రాయలసీమ విషయంలో ఏవిధమైన చర్యలు తీసుకుంటాడన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటు తెలంగాణ నేతలు తెలంగాణకు అనుకూలంగా లేఖరాయాలని పట్టుపడుతున్న విషయం విధితమే. అదేవిధంగా రాయలసీమ నేతలు సైతం తమకూ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తుండటంతో బాబు మైండ్ బ్లాక్ అయ్యింది.  కాగా తాజాగా ఆంధ్రాలోనై ఇదే తరహా ఉద్యమం సాగితే ‘దేశం’దుకాణం మూసేయ్యాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రత్యేక వాదం ఒక్క తెరాసలో మినహా అన్ని పార్టీలకు ప్రమాదంగా మారిందని చెప్పకతప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: