200 కోట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్... కానీ చివరలో ట్విస్ట్..?

praveen

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల బెడద బాగా ఎక్కువయిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఖాతాదారులకు రక్షణ కరువైంది. ఖాతాలను హ్యాక్ చేయడం తద్వారా భారీగా సొమ్మును  కొల్లగొట్టడం చేస్తున్నారు కేటుగాళ్లు . ఇలా ఇప్పటికే ఎంతోమంది తమ ఖాతాల్లో నుంచి డబ్బులు కోల్పోయిన వారూ ఉన్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు మాత్రం రోజురోజుకూ రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఏకంగా 200 కోట్లు స్వాహా  చేసేందుకు ప్రయత్నించారు. కానీ చివరికి ప్లాన్ కాస్త బెడిసి కొట్టి కటకటాల పాలయ్యారు. 

 

 

 వివరాల్లోకి వెళితే... టాటా కంపెనీ  మాతృ సంస్థ అయిన టాటా సన్స్ కు చెందిన బ్యాంకు ఖాతాను... హ్యాక్  చేసి 200 కోట్ల రూపాయలను స్వాహా  చేయాలని ఏడుగురు సైబర్ ముఠా సభ్యులు భావించారు. దీనికోసం ఒక ప్లాన్ వేసారు. ఇక ఈ ప్లాన్ అమలు చేసే లోపే  పోలీసులు వారి ఆట కట్టించారు. టాటా సన్స్ కథ  గురించిన వివరాలను ఇండస్ ఇండ్ బ్యాంక్ లో పనిచేస్తున్న ఉద్యోగి నుంచి తెలుసుకున్నారు నిందితులు. ఇక దాన్ని హ్యాక్ చేసి 200 కోట్లు కొల్లగొట్టాలి  అనుకున్నారు. దీని కోసం పక్క ప్లాన్ కూడా వేసుకున్నారు. కానీ దీన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు... నిందితులు నసీం సిద్ధికి, గుణజీవ్ బారాయిమ, సరోజ్  చౌదరి, సతీష్ గుప్తా, అనంత్ ఘోష్, ఆనంద్ నల్లవాడే నలను  అరెస్టు చేశారు. 

 

 

ఇక పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తమ వద్ద ఉన్న టాటా సన్స్ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతా పై ... ఎటువంటి దాడులు జరగలేదని... ఈ విషయంపై తమ భద్రత విభాగానికి కూడా ఎలాంటి సమాచారం లేదు అంటూ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఏదేమైనా సైబర్ నేరగాళ్ల ప్లాన్ ను ముందుగానే పసిగట్టి అరెస్టు చేసిన పోలీసులు పలువురు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: