మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తున్న కామాంధుడు.. చివరకు ఎలా దొరికాడో తెలుసా..?
కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు కామాంధులు ఒక్కో సారి ఎంత నీచమైన పని చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. వావి వరసలతో సంబంధం లేకుండా కామ వాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా.. మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. దీంతో దేశంలో మహిళలు, చిన్నారుల భద్రత గాల్లో దీపంలా తయారైంది. తాజాగా ఓ కామాంధుడు తన ఇంటిపక్కనున్న మహిళలపై కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే సెల్ ఫోన్ కెమెరాతో తన ఇంటి పక్కన ఉన్న బాత్రూముల్లో వీడియోలు రికార్డ్ చేసేవాడు.
రెండు రోజుల క్రితం కూడా అదే పని చేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో సదరు వ్యక్తిని స్థానికులు చితకబాదారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో జరిగిందీ ఘటన. ఖమ్మం పట్టణానికి చెందిన ఫణీందర్ (30) కొండాపూర్‌లోని మసీద్‌బండ ప్రాంతంలో భార్యతో కలిసి అద్దెకు నివసిస్తున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఫణీందర్ పక్కింట్లో మహిళలపై కన్నేసి.. తన పైశాచికత్వాన్ని బయటపెట్టాడు. ఈ క్రమంలోనే తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోని మహిళలు స్నానాలు చేస్తుండగా వీడియో తీయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు.
వారు బాత్రూంలోనికి వెళ్లినప్పుడు బాల్కనీ రెయిలింగ్ ఎక్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలోంచి సెల్‌ఫోన్ ద్వారా వీడియోలు తీసేవాడు. ఫణీందర్ చాలా రోజులుగా మహిళలకు తెలియకుండా వీడియోలు తీస్తున్నాడు. ఇక రెండు రోజుల క్రితం కూడా అదే చేస్తుండగా.. వెంటనే సదరు మహిళ ఫణీందర్‌ను గమనించి కేకలు వేసింది. మరియు కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. దీంతో వారు స్థానికులతో కలిసి ఫణీందర్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం ఫణీందర్‌ను పోలీసులకు అప్పగించారు. ఇక అతడి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాడు.