కవిత విషయంలో నిర్ణయం మార్చుకుని కేసీఆర్..?

praveen

ప్రస్తుతం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారిన అంశం ఒక్కటే. అదే రాజ్యసభ సీట్లను  ఎవరికీ కేటాయించనబోతున్నారూ  అనే అంశం.రెండు రాజ్యసభ స్థానాలకు గాను ఇప్పటికే అధికార పార్టీలో ఎంతో పోటీ నెలకొంది. దీని కోసం ఏకంగా నలుగురు అభ్యర్థులు ఆశావహుల గా ఉన్నారని అధికార పార్టీలో చర్చ కూడా నడుస్తోంది. రాజ్యసభ సీటు కోసం ఉన్న నలుగురు పేర్లలో ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ వారసులైన కవిత కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే కవితను రాజ్యసభకు పంపించాలా లేదా ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేలా  చేయాలా  అనే విషయంలో కేసీఆర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు ప్రస్తుతం అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు రాజ్యసభ స్థానాలను ఎవరికి కేటాయించాలి అనేది మాత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గులాబీ దళపతి కేసిఆర్ లకు మాత్రమే తెలుసు అని అంటున్నారు అధికార పార్టీ నేతలు. 

 

 

 అయితే మొన్నటి వరకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కవితను మంత్రిని చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక భాగం చేయాలని కేసిఆర్ భావిస్తున్నట్లు వార్తలు రాగా...  తాజాగా కేసిఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కవిత ను రాజ్యసభకు పంపేందుకు కేసిఆర్ నిర్ణయించినట్లుగా అధికార పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభకు కవితను  పంపే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. 

 

 

 కవితతో పాటు దామోదర్ రావు జూపల్లి రామేశ్వరరావు లలో ఒకరికి రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదా ఈ ముగ్గురిలో ఒకరికి ఒక సీట్లు కేటాయించి.. హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి కి మరో రాజ్యసభ సీట్లు కేటాయించే విషయాన్ని కూడా గులాబీ దళపతి కేసిఆర్ పరిశీలిస్తున్నారని వార్త కూడా వినిపిస్తోంది. అయితే రాజ్యసభ సీటు విషయంలో ఎంత మంది పేర్లు లిస్టు లో ఉన్నప్పటికీ కవిత పేరు మాత్రం మెయిన్  గా మారిపోయింది. ఈ నేపథ్యంలో కవిత రాజకీయ భవితవ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై   ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: