ముస్లిం దేశానికి పీఎం గా ఎన్నికైన మొదటి మహిళ బెనజీర్ భుట్టో ఇన్స్పిరేషనల్ స్టోరీ..!

Suma Kallamadi

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అతి శక్తివంతమైన మహిళ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇక విషయానికి వస్తే ముస్లిం దేశానికి ఎన్నికైన మొదటి మహిళా ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో తన 35 ఏళ్ళ వయసులోనే ప్రధానమంత్రి అయ్యి అతి పిన్న వయస్కులలో పీఎం లలో ఒకరిగా నిలిచారు. 1980 ల చివరలో... మళ్ళీ 1990 ల మధ్యలో ఆమె రెండుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేసి తన జీవితాన్ని ప్రజాస్వామ్యానికి, పాకిస్తాన్‌ను ఆధునీకరించడానికి అంకితమిచ్చారు. ఆమె తన దేశం యొక్క లోతైన పేదరికం, లింగ అసమానతలను పరిష్కరించడానికి ప్రయత్నించింది. ఆమె ఎలాంటి హింసను అయిన గట్టిగా వ్యతిరేకించింది.




బెనజీర్ భుట్టో తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో, అత్యంత ప్రజాదరణ పొందిన రాజనీతిజ్ఞుడు. 1970 లలో, అతను పాకిస్తాన్ అధ్యక్షుడిగా, ప్రధాన మంత్రిగా పనిచేశాడు. ఐతే అతను పాకిస్తాన్ సైనిక నియంత చేత బెనాజీర్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చిన కొద్ది రోజుల తరువాత ఉరితీయబడ్డాడు.



ఆమెని ఇప్పటికి ఎంతోమంది ఇష్టపడుతున్నరంటే ఆమె పురుష ఆధిపత్య సమాజాలలో నివసిస్తున్న బిలియన్ల మంది మహిళలకు ప్రేరణనిచ్చింది. ఆమె తండ్రిని నియంత ఉరితీశానా, ఆమె సోదరులుని ప్రణాళికాబద్ధమైన కుట్రతో చంపినా, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నా భుట్టో ఇవన్నీ భరించి సంకల్పం ధైర్యం తో ముందడుగులు వేసింది.




ఏది ఏమైనా ఆమెపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ తాను పాకిస్థాన్ దేశాన్ని మంచిగా తీర్చిదిద్దినట్లు లక్షల మంది చెబుతుంటారు. ఆకట్టుకునే పర్సనాలిటీ ఉన్న బెనజిర్ భుట్టో ని రావల్పిండి లో 2007లో బిలాల్ అనే 15 ఏళ్ల సూసైడ్ బాంబర్ దాడితో దారుణంగా హత్యకు గురైంది. సమకాలీన కాలంలో పాకిస్తాన్ చూసిన ఉత్తమ రాజకీయ నాయకులలో ఆమె ఒకరు అని చెప్పుకోవచ్చు. శక్తివంతమైన దూరదృష్టి గల రాజకీయ నాయకురాలు కోల్పోవడం పాకిస్తాన్ కి చాలా నష్టమే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: