హ్యాపీ సండే 8-MAR: ఈ వారం టీడీపీ ఏం చేసిందంటే... !

ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు గాను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించాలి అనే భావనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ నేపధ్యంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సహా పలువురు మాజీ మంత్రులు ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ వారం చేసిన ప్రజా చైతన్య యాత్రలో లోకేష్ కి షాక్ తగిలింది. 

 

తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో పర్యటనకు వెళ్ళిన లోకేష్ ని అక్కడి ప్రజలు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనితో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది ఈ యాత్రలో. ఇక బీసీ రిజర్వేషన్ అంశానికి వస్తే హైకోర్ట్ ఆదేశాల మేరకే జగన్ నడుచుకున్న నేపధ్యంలో సుప్రీం కోర్ట్ లో టీడీపీ ఎంపీలు స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసారు. మాజీ మంత్రి కోల్లు రవీంద్ర, బందరు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ సహా పలువురు బీసీ నేతలు ఢిల్లీ వెళ్ళారు. వీరితో కలిసి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసారు.

 

ఇక దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పార్టీ నేతలకు పలు సూచనలు కూడా చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే... చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడానికి అంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని విడుదల చేసారు. ఇలా ఈ వారం టీడీపీ బిజీ బిజీ గా గడిపింది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్ లు తగ్గించడంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: