బెంగాలీ, నేపాలీ అమ్మాయిలతో ఇంట్లోనే వ్యభిచారం.. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు

Suma Kallamadi

కొంత మంది డబ్బు మీద ఉన్న మోజుతో ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో కొంత మంది వ్యభిచార గృహాలని నడిపిస్తూ అమ్మాయిలా జీవితాలతో వ్యాపారం చేస్తున్నారు. వారి జీవితాలను పణంగా పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ వ్యభిచార గృహణి నడిపే వ్యక్తులు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబరచుకొంటారు. వారికీ డబ్బును ఎరగా వేసి అమాయక అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతారు.

 

తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. పక్కా సమాచారంతో గురువారం అర్ధరాత్రి ఓ ఇంటిపై రైడ్ చేశారు. ఈ రైడ్ లో ముగ్గురు సెక్స్ వర్కర్లు సహా 8మందిని అరెస్ట్ చేశారు. కల్యాణ్‌పూర్‌ లోని ఆవాస్ వికాస్ కాలనీలోని ఓ ఇంటికి ఇటీవల అపరచిత వ్యక్తుల తాకిడి ఎక్కువైంది. 

 

ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఆ ఇంటికి వస్తున్నారు. రాత్రి సమయాల్లోనూ యువకుల తాకిడి ఎక్కువగా ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మఫ్టీలో అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో వెస్ట్ ఎస్పీ అనిల్‌కుమార్‌ తన సిబ్బందితో రైడ్ నిర్వహించారు.

 

పోలీసులను చూసిన ఓ వ్యక్తి పారిపోగా మిగిలిన 8మందిని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు సెక్స్‌ వర్కర్లలో ఇద్దరు పశ్చిమ బెంగాల్‌ కు చెందిన వారిగా గుర్తించారు. మరొకరు నేపాలీ మహిళ. వీరిని పునరావాస కేంద్రానికి తరలించారు.

 

ఈ అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్న ప్రమోద్ గుప్తాతో పాటు విటులు అమిత్‌కుమార్, మంజేశ్ శుక్లా, శివం కశ్యప్, మాడియాన్‌ ను అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు. మరో నిర్వాహకుడు వినీత్ శుక్లా తప్పించుకున్నాడన్నారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: