మైండ్ గానీ దొబ్బిందా.. రాజాకీయాలు, రేపులు చేయమని నేర్పవు.. మీరు మీ మాటలు... ??

venugopal

రాజకీయాల్లో హోదా పెరిగిన కొద్ది నాయకునికి ఒక హుందాతనం అలవడాలి.. అలా కాదని ఒక గల్లీ లీడర్ మాట్లాడినట్లుగా, రాజకీయ అవగహన లేని వ్యక్తి ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తానంటే కుదరదు.. దీనివల్ల ఆ నాయకునిపై ఎవరికి గౌరవం కలుగదు.. వయస్సు పెరిగిన కొద్ది రావలసింది అనుభవం, మాటతీరులో మార్పూ. ఈ విషయాన్ని ఎందుకు చెప్పవలసింది వచ్చిందంటే.. మహిళాదినోత్సవం సందర్భంగా బాబుగారికి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్ చర్చాంశనీయంగా మారింది..

 

 

అదేమంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో 180 మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి.. అందులో 33 మంది చిన్నారులు ఉన్నారంటే చెప్పుకోవడానికే సిగ్గుచేటు అనిపిస్తుంది.. ఇక ఈ బాధితుల్లో బడుగుబలహీన వర్గాల వారే ఎక్కువగా ఉండగా, నిందితుల్లో వైసీపీ వారే ఎక్కువగా ఉన్నారు.. కంటిమీద కునుకు లేకుండా బ్రతుకుతున్న ఏపీ ప్రజలను చూస్తుంటే ఇవేమి రాజకీయాలనే ప్రశ్న తలెత్తుతుంది.. ఇక ఆడపిల్లలను రక్షించడానికి దిశ చట్టం అమల్లోకి తెస్తే సంతోషించాం కానీ సమాజం దిశను మార్చేస్తూ, ఈ చట్టం ఏ ఆడపిల్లను రక్షించలేకపోతుంది.. అంటూ చంద్రబాబుగారి సోషల్ వింగ్ పోస్టు చేసింది..

 

 

ఇదిలా ఉండగా తప్పుచేసే ఆలోచన ఉన్నవాడిని ఏ చట్టం మార్చలేదు.. అంతెందుకు నిర్భయఘటన జరిగాక చట్టాన్ని మరింత కఠినంగా చేసిన అత్యాచారాలు ఆగాయా.. చెడు చేయాలనుకున్న వాడి ఆలోచనను ఏ చట్టాలు భయపెట్టలేవు.. తెలంగాణాలో దిశ ఘటన జరిగాక, అత్యాచారాలు తగ్గాయా.. ఎన్ని చట్టాలు వచ్చిన తప్పు చేసేవాడు చేస్తూనే ఉన్నారు.. చివరికి అత్యాచారనేరంలో దొరికితే ఉరిశిక్షపడుతుందని తెలి కూడా, లెక్కచేయడంలేదు కామాంధులు.. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవాడికి ఇవేమి అడ్డురావు..

 

 

ఇక ఇలాంటి ఘటనను రాజకీయానికి ముడిపెట్టడం అంత నీచమైన పని ఏది ఉండదు.. ప్రభుత్వాలు రేపులు చేయమని చెప్పవు.. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. అందువల్ల అనవసర నిందలు ఇక్కడ అవసరం లేదు.. తప్పుచేసిన వాడు ఏ పార్టీలో ఉన్న అతను నేరస్దుడే అంటారుగానీ మరో పేరు అతనికి తగిలించరు కదా.. అందుకే ఇలాంటి ప్రచారాలు చేసే ముందు ఒక్క సారి ఆలోచించాలని కొందరు అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: