చంద్రబాబు కోటరీయే పార్టీని నాశనం చేస్తోందా ? .. జేసి సంచలనం

Vijaya
చంద్రబాబునాయుడు కోటరీయే పార్టీని నాశనం చేస్తోందంటూ సీనియర్ నేత, మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. చంద్రబాబుతో భేటి సందర్భంగా ఇద్దరి మధ్య స్ధానిక సంస్ధల ఎన్నికలపై చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాలనపై జనాల్లో ఇంకా వ్యతిరేకత రాలేదని జేసి చెప్పిన మాటలను చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు చాలామంది లబ్దిదారులకు చేరుతోంది కాబట్టి ఓట్లు కూడా వైసిపి అభ్యర్ధులకే పడే అవకాశాలున్న విషయాన్ని జేసి చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు.

చంద్రబాబు లెక్క ప్రకారం జనాల్లో జగన్ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిడిపికి ఓట్లు వేయటానికి జనాలు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పిన మాటలతో జేసి విభేదించారు. పార్టీలో అందరూ అనుకుంటున్నట్లు జగన్ పై జనాల్లో ఇంకా వ్యతిరేకత రాలేదని కానీ వ్యతిరేకత రావటం మాత్రం ఖాయమని జేసి అంచనా వేశారు. కొంత కాలం వెయిట్ చేస్తే అప్పుడు జనాల్లో వ్యతిరేకత పెరుగుతుందని దాన్ని పార్టీ క్యాష్ చేసుకోవాలన్న  జేసి సూచనను చంద్రబాబు ఖండిచారట.

మద్యం, డబ్బు పంపిణి చేసేవాళ్ళపై కేసులు పెట్టాలని, జైళ్ళకు పంపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాలకే ఎక్కువగా నష్టమన్న జేసి మాటలను కూడా చంద్రబాబు కొట్టేశారు. జనాలు టిడిపిని  ఆదరించటానికి రెడీగా ఉన్నపుడు పోటి చేయటానికి పార్టీ నేతలు వెనకాడాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు మాటలతో జేసి విభేదించారు. ఇదే సందర్భంలో జేసి మాట్లాడుతూ మీకు ఎవరో రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నట్లుంది అని చెప్పారట.

అంతేకాకుండా ’మీ చుట్టు ఉన్న కోటరీయే క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వాస్తవాలను చూడనీయకుండా, తెలియనీయకుండా అడ్డుపడుతున్నా’రంటూ జేసి గట్టిగానే చెప్పారట. అయితే సహజంగానే జేసి మాటలను చంద్రబాబు కొట్టిపడేశారు. తాను క్షేత్రస్ధాయి నుండే ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు గట్టిగా చెప్పటంతో చేసేది లేక జేసి నమస్కారం చేసి బయటకు వచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: