నామినేషన్ల విషయంలో చంద్రబాబుకు ఈసీ షాక్

Vijaya
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తగ్గట్లుగా చంద్రబాబునాయుడు వ్యవహరించటం లేదు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మరీ ఇంతగా దిగజారిపోయి అబద్ధాలు ఎందుకు చెబుతున్నారో అర్ధం కావటం లేదు. తాజాగా ముగిసిన ఎంపిటిసి, జడ్పిటిసి నామినేషన్ల ఘట్టంలో కొన్ని చోట్ల గొడవలు జరిగిన మాట వాస్తవమే. అంతటిదానికి ప్రతిపక్షాలను అసలు నామినేషన్లే వేయనీయకుండా అధికారపార్టీ అడ్డుపడుతోందని నానా యాగీ చేస్తున్నారు. ప్రతిపక్షాల నేతలను భయపెట్టి ఎన్నికలను ఏకపక్షంగా చేసుకుంటారా ? రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, బీహార్ కన్నా అధ్వాన్నంగా మారిపోయిందంటూ ఏవేవో మాట్లాడేస్తున్నాడు.

నిజంగా  చంద్రబాబు చెప్పినట్లే రాష్ట్రంలో అధికారపార్టీ అంత అరాచకానికి పాల్పడుతోందా ? అంటే లేదనే సమాధానం వస్తోంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్పటం లేదు. చంద్రబాబు పచ్చమీడియానే చెప్పింది. ఎలాగంటే తాజాగా ముగిసిన నామినేషన్లలో ఏ పార్టీ తరపున ఎన్ని నామినేషన్లు పడ్డాయన్న విషయాన్ని ఎన్నికల కమీషన్ ప్రకటించింది.

కమీషన్ లెక్కల ప్రకారం 652 జడ్పిటిసి స్ధానాలకు గాను 4778 నామినేషన్లు పడ్డాయి. ఇందులో అధికార వైసిపి తరపున  1866 నామినేషన్లుంటే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి తరపున  1413 నామినేషన్లు పడ్డాయి. ఇక బిజెపి తరపున 473, జనసేన తరపున 270 నామినేషన్లు వేశారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసిపి, టిడిపిల మధ్య నామినేషన్ల తేడా సుమారు 453 మాత్రమే. నిజానికి టిడిపి తరపున ఈమాత్రం నామినేషన్లు వేయటమే ప్రస్తుత పరిస్ధితుల్లో చాలా ఎక్కువనే చెప్పాలి. ఇంక వైసిపి అడ్డుకున్నదెక్కడ ?

ఇక ఎంపిటిసి నామినేషన్లు చూద్దాం. 9696 ఎంపిటిసి స్ధానాలకు గాను 50 064 నామినేషన్లు పడ్డాయి. ఇందులో వైసిపి తరపున 23,121 నామినేషన్లు పడితే తెలుగుదేశంపార్టీ తరపున  18242 నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి తరపున 1816, జనసేన తరపున 2027 మంది నామినేషన్లు వేశారు.  నిజానికి టిడిపి తరపున ఇన్ని వేల నామినేషన్లు వేశారంటేనే చంద్రబాబు చెబుతున్నదంతా అబద్ధాలే అని తేలిపోతోంది. నామినేషన్ల సందర్భంగా అసలు ఎక్కడా ఘటనలు జరగలేదని చెప్పేందుకు లేదు. కానీ చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా అరాచకాలైతే జరగటం లేదని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: