కరోనా సోకినా టెక్కీ భార్య పరార్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Satvika

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల చైనాలో చాలా మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించిన వ్యాప్తి రోజు రోజు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.. ఈ కరోనా వైరస్ ప్రభావ పెరుగుతుండటంతో చాలా మంది భయంలో బ్రతుకుతున్నారు. కరోనా లక్షణాలున్న రోగులను ప్రత్యేక వార్డులలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశారు. 

 

 

 

కరోనా దెబ్బకు ప్రపంచం వణికి పోతుంది. భారత దేశంలో కూడా కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ఆరంభించింది. తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాల్లో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు.ఈ కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న రోగులను నెగిటివ్ వచ్చేవరకు వైద్యులు పరివేక్షణలో ఉంచారు. 

 

 

 

తాజాగా బెంగళూరులోని ఒక టెక్కీకి కరోనా సోకిన విషయం తెలిసిందే.గూగుల్ కంపెనీ ఉద్యోగి తన భార్యతో కలిసి హనీ మూన్ కోసం యూరప్ వెళ్లి వచ్చిన తరువాత అతనికి కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని బలవంతంగా ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అతని భార్య మాత్రం క్వారంటైన్ లో ఉండకుండా తప్పించుకున్నందుకు ఆమెపై కేసు నమోదు చేసారు ఆగ్రా పోలీసులు. 

 

 

 

టెక్కీ చెబుతున్న ప్రకారం భార్య తాను ఇద్దరమూ ఒకే రోజు ఇండియాలో ల్యాండ్ అయ్యామని అంది. ఆమెకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో  ప్రస్తుతానికి ఆమె ఆమె కుటుంబ సభ్యులందరు ఇసోలాటిన్ వార్డులోనే ఉన్నారు.కరోనా వైరస్ పై తెలంగాణ సర్కార్ అప్రమత్తమై కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు షాపింగ్ మాల్స్ ను కూడా మూసి వేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటికే పలు ఉద్యోగ సంస్థలు కూడా సెలవు ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: