కరోనా వల్ల చనిపోతే ఏం చేయాలి..?

praveen

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇప్పటికే 150 దేశాలకు పైగా వ్యాప్తి చెందింది. ఇక పలు దేశాలలో అయితే చైనా కు మించి మరణ మృదంగం మోగిస్తోంది ఈ మహమ్మారి వైరస్. ఇక ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ పేరు ఎత్తితే చాలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడంతో ఇది ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. దీనికితోడు సోషల్ మీడియాలో వదంతులు కూడా తోడవడంతో... ప్రజలు చిగురుటాకులా వణికిపోతారు. ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ప్రజల్లో రోజురోజుకు కరోనా వైరస్ వల్ల ప్రాణ భయం పోతుంది. 

 

 

 ఇక ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే భారత్లోకి కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రవేశించింది . ఇక భారత్లో కూడా ఈ వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో అటు కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు... సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యంగా దేశం షెడ్ డౌన్  దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే కరోనా  ద్వారా భారత్ లో  కూడా ఇప్పటికే ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ సోకి మరణించిన వారికీ  అంత్యక్రియలు ఎలా జరపాలి అనే దానిపై అందరిలో ఓ ప్రశ్న నెలకొంది. 

 

 

 అయితే కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారికి అంత్యక్రియలు ఎలా చేయాలి అనే దానిపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి మృతదేహాలను తరలించే టప్పుడు ఇన్ఫెక్షన్ నియంత్రణ విధానాలను పాటించాలి అంటూ సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఆ మృతదేహం నుంచి ద్రవాలు బయటకు రాకుండా నోటి తో పాటు నాసికా రంధ్రాలు అన్ని మూసివేయాలని  సూచించింది. మృతదేహాన్ని లీక్ ప్రూఫ్ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచాలి అంటూ సూచించింది. ఇవన్నీ జాగ్రత్తల తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం గాని లేదా మార్చరీకి తరలించారు చేయాలి అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: