నిర్భయ దోషుల ఉరి చివరి 30 నిమిషాలు ఏం జరిగిందంటే..!
దాదాపు ఏడు సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వచ్చిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరి అమలైన విషయం తెలిసిందే. గత రెండు మూడు నెలల నుంచి వరుసగా చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ నిందితులు క్రమక్రమంగా ఉరి కంబానికి దగ్గరయ్యారు. మొన్నటివరకు హైకోర్టు సుప్రీంకోర్టు ఇలా అన్ని కోర్టుల్లో ఉరిశిక్ష విధించినప్పటికీ నలుగురు నిందితులు తమకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ చట్టం తీర్పును అవహేళన చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు నిందితులకు ఉన్న అన్ని అవకాశాలను పూర్తవడంతో ఉరి కంబానికి ఎక్కక తప్పలేదు. తాజాగా నిర్భయ నిందితులు వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ పటియాల హౌస్ కోర్టు నిర్ణయాన్ని నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ నిందితులకు ఉరి అమలు చేశారు అధికారులు.
అయితే నిర్భయ నిందితులకు ఉరి కి సంబంధించి బీహార్ జైలు అధికారులు పలు విషయాలను వెల్లడించారు. చివరి కోరిక ఏమిటి అని అడిగితే నిర్భయ నిందితులు చివరి కోరిక ఏమీ చెప్పలేదు అధికారులు తెలిపారు. నలుగురు నిందితులు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని.. గత రాత్రి భోజనం కూడా చేయలేదు అంటూ తెలిపారు. అంతేకాకుండా నిందితులను ఉరితీయటానికి ముందు కూడా బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కూడా నలుగురు నిందితులు నిరాకరించారు అంటూ తెలిపారు అధికారులు . ఇక గురువారం రాత్రి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నలుగురు నిందితులను వేర్వేరు గదుల్లో ఉంచాము అంటూ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు నిందితులను నిందితులు నిద్ర లేపే సమయానికి... సుప్రీం కోర్టు వారి చివరి పిటిషన్ను కొట్టివేసింది అంటూ తెలిపారు.
ఇక నిర్భయ దోషులకు ఉరి అమలు చేసే ముందు దోషులను వారి కుటుంబ సభ్యులకు చూపించామని... ఇక నిందితులకు ఉరి వేసే నేపథ్యంలో తీహార్ జైలు మొత్తం లాక్ డౌన్లో ఉంచాము అంటూ తెలిపారు. మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని... ఇక జైలులో ఉన్న సమయంలో నిందితులు పని చేసి సంపాదించిన డబ్బును కుటుంబ సభ్యులకు తెలిపారు. సరిగ్గా కోర్టు తీర్పు ఇచ్చిన సమయం ఐదున్నర గంటలకు నిర్భయ దోషులకు ఉరి తీస్తాను అంటూ తెలిపారు. ఇక నిబంధనల ప్రకారం... నిర్భయ దోషులు అందరినీ 30 నిమిషాల పాటు ఉరికొయ్యకు వేలాడదీసాము అంటూ తెలిపిన తీహార్ జైలు అధికారులు... వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే ఉరి తీయడానికి ముందు నిందితుల్లో ఒకరైన వినయ్ తనను ఉరి తీయవద్దు అంటూ పోలీసులను వేడుకున్నారు అధికారులు వెల్లడించారు.