కరోనా నివారణ విధుల్లో డాక్టర్... తల్లి చనిపోయినా కూడా....

Suma Kallamadi

కరోనా... కరోనా... ఎటు చూసినా ఎవరి నోటా అయినా ఇదే మాట. ఈ మహమ్మారి జనాలను ఎంతగా భయపెడుతుందో అందరికి తెలిసిందే. ఈ కరోనా వైరస్ తో డాక్టర్స్ ఎప్పటికప్పుడు అప్రమతంగా ఉండాల్సి వస్తుంది. డాక్టర్ అంటే దైవంతో సమానంగా కొలుస్తారు. ఏదైనా కొత్త జబ్బు వచ్చిందంటే చాలు డాక్టర్స్ కోసం క్యూ కడతారు. కరోనా నేపథ్యంలో కొందరు డాక్టర్ల సందేశం ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది.

 

కరోనా ఎఫెక్ట్ కు అందరూ ఇళ్లకే పరిమితమైయ్యారు. వైద్యులు మాత్రం కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇస్తూ కొత్త జీవితం ప్రసాదించేందుకు కృషి చేస్తున్నారు. కరోనా పంజా నుండి ప్రజలను కాపాడేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వైద్యులు చాలా కష్టపడుతున్నారు. 

 

తాజాగా ఒడిశాకు చెందిన ఓ డాక్టర్ కరోనా కేసులు రావడంతో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ వైద్యుడు తన తల్లి చనిపోయినా అతను కరోనా విధుల్లో పాల్గొన్నారు. కని, పెంచిన అమ్మ మరణించినా సరే.. ఆ బాధను గుండెల్లో దిగమింగి, కరోనాపై పోరాటానికి వెళ్లారు. తన తల్లి ప్రాణాలను ఎలాగో కాపాడుకోలేదు. కరోనా సోకినా పేషేంట్లను అయినా కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమైయ్యాడు.

 

ఆయన పేరు అశోక్ దాస్ ఒడిశాలోని సాంబాల్‌పూర్‌లో కోవిడ్-19 నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఐతే 80 ఏళ్ల వయసున్న ఆయన తల్లి మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. అమ్మ చనిపోవడంతో అశోక్ దాస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అంత బాధలోనూ తన డ్యూటీని పక్కనబెట్టలేదు అశోక్. 

 

కరోనావైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఒక వైద్యుడిగా తన బాధ్యతను మరచిపోలేదు. కరోనాపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాను పనిచేసే ఆస్పత్రికి వెళ్లి కరోనా అనుమానితులకు చికిత్స చేశారు.

 

డ్యూటీ అనంతరం తిరిగి ఇంటికి చేరుకొని తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తనకు ప్రజాసేవే ముఖ్యమని.. అమ్మ కూడా అదే చెప్పేదని అన్నారు అశోక్. హ్యాట్సాఫ్ సార్.. సరిలేరు నీకెవ్వరు' అంటూ సెల్యూట్ చేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ సైతం ఆయన్ను ప్రశంసించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: