జనతా కర్ఫ్యూ : భారత రావాలనుకున్న రోజు వచ్చింది..?
విపత్తులు వచ్చినప్పుడు ప్రజలందరూ కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రస్తుతం భారత దేశానికి ఇలాంటి విపత్తు వచ్చింది. కంటికి కనిపించని శత్రువు భారత ప్రజల పై దాడి చేస్తూ ప్రాణాలను హరించుకుపోతుంది. ఇప్పటికే ఎంతో మందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది. ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదు... భారత బలం ఏమిటో చూపించాల్సిన సమయం వచ్చింది. భారత ఐక్యతను చాటి చెప్పే రోజు రానే వచ్చింది. భారత ప్రజలందరూ యుద్ధానికి సిద్ధమై... ఇళ్ల కే పరిమితం అవుతున్నారు. కనిపించని శత్రువుతో... ఆ శత్రువు కే కనిపించకుండా యుద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. భారతదేశంపై కోరలు చాస్తూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకునేందుకు సిద్ధమవుతున్న కనిపించని శత్రువు ప్రాణాంతకమైన కరోనా వైరస్ పై యుద్ధానికి అందరూ సిద్ధం అయిపోయారు.
భారతదేశం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం గా మారిపోయింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత ఐక్యతను చాటి... దేశ ప్రజలందరూ సమన్వయం పాటించి.. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేవలం ఇళ్ళకు మాత్రమే పరిమితం కావాలని... 14 గంటలపాటు ఇళ్లకు పరిమితమై... హాయిగా ఉంటే చాలు కనిపించని శత్రువు కరోనా మహమ్మారిని తరిమి కొట్టవచ్చు అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అయితే దేశ సేవ చేయడానికి ఇదే మంచి సమయం. ఎన్ని రోజుల వరకు ఆర్మీ కి వెళ్లి... శత్రువులతో పోరాడి.. దేశాన్ని రక్షించుకోవచ్చు అని అనుకుంటారు చాలా మంది.
హాయిగా ఊర్లోనే ఉంటూ దేశాన్ని రక్షించే అవకాశం వస్తే ఎంత బాగుండు అనుకునేవారు కూడా చాలామంది. వారందరూ కోరుకునే రోజు రానే వచ్చింది. ఇంట్లో నుంచి అంగుళం కూడా కదలకుండా... కాలు మీద కాలేసుకుని... దర్జాగా టీవీ చూస్తూ... ఎలాంటి టెన్షన్ లేకుండా.. ఎలాంటి శ్రమ లేకుండా... రెస్ట్ తీసుకుంటూనే... దేశాన్ని కాపాడే అవకాశం ప్రస్తుతం భారత ప్రజలందరికీ వచ్చింది. ఇలాంటి ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందాం.. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు భారత ప్రజల అందరి సమస్య.. అందరూ కలిసికట్టుగా పాటిద్దాం... ఇంట్లోనే సమయం గడుపుదాం.