హెరాల్డ్ స్పెషల్ కర్రీ : ఆంధ్రా స్టైల్ గుత్తివంకాయ కూర
ఆంధ్ర వంటకాల్లో గుత్తి వంకాయ కూర ఎంతో ఫేమస్ రెసిపీ. ఎవరైనా సరే కూర నోట్లో పెట్టుకుంటే ఫిదా అవ్వాల్సిందే...
గుత్తివంకాయ కూరకి కావాల్సిన పదార్ధాలు:
వంకాయలు, ఉప్పు, వేరు శనగ పలుకులు, గసగసాలు, ధనియాలు, లవంగాలు, మెంతులు, యాలుకలు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు, కారం, నూనె, ఆవాలు, కరివేపాకు, చింతపండు గుజ్జు, కొత్తిమీర.
తయారు చేయు విధానం: ముందుగా గుత్తివంకాయ కూరలోకి వంకాయల్ని మధ్యకి నాటు పెట్టుకోవాలి. పూర్తిగా కోసేస్తే లోపల మసాలా పెట్టడం అవ్వదు కనుక. కాబట్టి మధ్యకి వంకాయలని కోసి పక్కన ఉంచాలి. ఆ తర్వాత కడాయి లో నూనె వేసి వేడి ఎక్కాక వేరు శనగ పలుకులు, గసగసాలు, ధనియాలు, లవంగాలు, మెంతులు, యాలుకలు, ఎండు కొబ్బరిని దానిలో ఒక దాని తర్వాత మరొకటి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కాసేపు పక్కన ఉంచి చల్లారనివ్వాలి.
పూర్తిగా చల్లారాక దానిలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు వేసి మిక్సీ పట్టాలి. ఇలా బాగా నలిగిపోయాక దీనిని పక్కన పెట్టుకోవాలి. వంకాయల్లో ఈ మసాలా ముద్దని కూరాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కాస్త నూనె అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేయించాలి. ఒక ఉల్లిపాయని ముక్కలు చేసి దానిలో వెయ్యాలి. బాగా వేగిపోయాక దీనిలో మసాలా మద్ద కూరిన వంకాయలని వెయ్యాలి.
కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టేయాలి. కొంచెం మగ్గాక దీనిలో మసాలా ముద్ద మిగిలనది కాస్త వేసేయాలి. బాగా మగ్గిపోయాక కొంచెం చింతపండు గుజ్జుని వేసి కలపాలి. కొంచెం కారం వేసి బాగా పై నుండి కిందకి కలపాలి. చివరలో కొత్తిమీర పైన వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఆంధ్రా స్టైల్ గుత్తివంకాయ కూర రెడీ.